ఆ పౌడర్‌ను అక్కడ పూసుకుంటే అండాశయ కేన్సర్ వచ్చింది.. బాధితుడికి భారీగా పరిహారం.. అమెరికా కోర్టు

శనివారం, 29 అక్టోబరు 2016 (10:41 IST)
జాన్సన్ అండ్ జాన్సన్ టాల్కం పౌడర్ వాడటంతో అండాశయ క్యాన్సర్ వ్యాధి వచ్చిందని అమెరికాలోని కాలిఫోర్నియాలో ఓ మహిళ కోర్టును ఆశ్రయిస్తే 70 మిలియన్ అమెరికన్ డాలర్లు (రూ.455 కోట్లు) పరిహారం జాన్సన్ కంపెనీ ఇవ్వాలని అమెరికా కోర్టు తీర్పునిచ్చింది. 
 
కాలిఫోర్నియాలోని మోడెస్టోకు చెందిన డిబోరా 2012లో జాన్సన్ అండ్ జాన్సన్ టాల్కం పౌడర్ వాడి అనారోగ్యానికి గురైంది. జాన్సన్ అండ్ జాన్సన్ టాల్కం పౌడర్‌ను డిబోరా కొన్నేండ్ల నుంచి సున్నితమైన ప్రాంతంలో వేసుకొనేవారు. దీంతో ఆమె అండాశయ క్యాన్సర్ బారినపడ్డారు. ఈ విషయాన్ని డిబోరా ఫొటోలతో కలిపి కోర్టులో పిటిషన్ వేశారు. 
 
అంతేకాదు అండాశయ క్యాన్సర్‌తో శరీరంలో అనేక మార్పులొస్తాయని, ఒబెసిటీ, పిల్లలు పుట్టకపోయే సమస్య వస్తున్నాయని ఆయన పేర్కొన్నారు. అయితే పిటిషనర్ వాదనలను జాన్సన్ కంపెనీ తోసిపుచ్చింది. షిటిషనర్ ప్రవేశపెట్టిన సాక్ష్యాలతో ఏకీభవించిన కోర్టు.. జాన్సన్ అండ్ జాన్సన్ కంపెనీకి 70 మిలియన్ అమెరికన్ డాలర్ల పరిహారం ఇవ్వాలని ఆదేశించింది. 

వెబ్దునియా పై చదవండి