స్లిమ్‌గా మారిన కిమ్ జాంగ్ వీడియో వైరల్

సోమవారం, 28 జూన్ 2021 (15:47 IST)
Kim Jong Un
ఉత్తర కొరియా నియంత కిమ్ జాంగ్ ఉన్‌కు సంబంధించిన ఓ వీడియో వైరల్ అవుతోంది. ఆ వీడియోలో కిమ్ చాలా బరువు తగ్గి స్లిమ్‌గా కనిపిస్తున్నారు. దీంతో ముందు, తర్వాత అంటూ ఆయనకు సంబంధించిన వీడియోలు నెట్‌లో హల్‌చల్ చేస్తున్నాయి. అయితే ఆయన బరువు తగ్గడంపై చాలా మంది నార్త్ కొరియన్లు ఆందోళన చెందుతున్నారు.
 
తమ నేత ఇలా కనిపిస్తున్నారేంటని ఆశ్చర్యపోతున్నారు. కేవలం 4 నెలల సమయంలోనే కిమ్ ఇలా మారిపోయినట్లు ట్విటర్‌లో పోస్ట్ చేసిన వీడియోలో రాయ్‌టర్స్ చెప్పింది. అయితే కిమ్ నిజంగానే డైట్‌లో ఉన్నారా లేక బరువు తగ్గడానికి మరేదైనా కారణంగా ఉందా అన్నది తెలియలేదు.
 
ఆయన సన్నబడ్డారనే వార్తలు ప్రపంచ వ్యాప్తంగా జనాలను ఆసక్తి రేపుతుంటే.. కిమ్‌ అలా కనిపించడంపై ఉత్తర కొరియా ప్రజలు మాత్రం ఆందోళనకు గురవుతున్నారు.  తమ ప్రియతమ నేతకు ఏమైందో అని తెగ బెంగ పడిపోతున్నారు. ఎప్పుడూ బొద్దుగా కనిపించే కిమ్ ఇప్పుడు సన్నబడటంతో ఆయన ఆరోగ్యం చెడిందన్న వార్తలు వినిపిస్తున్నాయి. అయితే కిమ్‌ బరువు తగ్గడానికి గల కారణాలపై వివరణ లేదు.
 
కానీ ఇంతకుముందు 140 కిలోల బరువుండే కిమ్‌ ప్రస్తుతం 10 నుంచి 20 కిలోల వరకు బరువు తగ్గివుండవచ్చని అంచనా వేస్తున్నారు. అంతకముందు, ప్రస్తుతం బరువు తగ్గిన కిమ్‌ వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. కేవలం 4 నెలల సమయంలోనే కిమ్ ఇలా మారిపోయినట్లు రాయ్‌టర్స్ ట్విటర్‌లో ఓ వీడియో పోస్ట్ చేసింది. దీనిపై నెటిజన్లు స్పందిస్తూ కిమ్‌ 'ఒకవేళ డైట్‌లో ఉన్నారేమో' అంటూ కామెంట్స్‌ చేస్తున్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు