ఆఫ్ఘనిస్థాన్ రాజ్యాంగం ప్రకారం... దేశాధ్యక్షుడు పరారీలో ఉన్నా, దేశాధ్యక్షుడి గైర్హాజరీలోనూ ఉపాధ్యక్షుడు-1 దేశానికి ఆపద్ధర్మ అధ్యక్షుడు అవుతాడు. ప్రస్తుతం నేను దేశంలోనే ఉన్నాను. నేనే చట్టబద్ధమైన ఆపద్ధర్మ పాలకుడ్ని. ఈ క్రమంలో ఏకగ్రీవం దిశగా అందరినీ ఒప్పించేందుకు ప్రయత్నిస్తున్నా అని అమృల్లా సలేహ్ వివరించారు.
భవిష్యత్తులో తాను తాలిబన్లకు లొంగిపోయే ఉద్దేశం లేదని అఫ్గాన్ మాజీ ఉపాధ్యక్షుడు అమ్రుల్లాహ్ సలేహ్ ప్రకటించారు. పంజ్‌షిర్ లోయలోకి తాలిబన్లను రానీయకుండా తాము పోరాడతామని ఆయన ప్రకటించారు. ''నాపై నమ్మకం ఉంచి.. నా మాట వినే లక్షల మందిని నేను నిరాశపర్చను. నేను ఎప్పుడూ తాలిబన్లతో కలిసి పనిచేయను. అది ఎప్పటికీ జరగదు'' అని ఆయన ట్వీట్ చేశారు.