శృంగారంకంటే ఫోన్ బెస్ట్ అంటున్న యువత... ఐతే అది అలా అవుతోంది...

శనివారం, 18 జనవరి 2020 (19:45 IST)
స్మార్ట్ ఫోన్.. ప్రస్తుతం ప్రతీ ఒక్కరి దగ్గర ఉండే కామన్ వస్తువుల్లో ఈ స్మార్ట్ ఫోన్ కూడా ఒకటి. ఏ వస్తువుల్లో ఉన్నా లేకపోయినా.. ఈ గ్యాడ్జెట్ అయితే కచ్చితంగా ఉంటుంది. ఓ రకంగా చెప్పాలంటే ఉదయం లేచింది మొదలైన స్మార్ట్ వినియోగం నిద్రకు చేరువయ్యే వరకూ మన చేతిలో ఉండాల్సిందే.. లేకపోతే ఊపిరి తీసుకోవడం కూడా కష్టంగా ఉన్నట్లు అనిపిస్తుంటుంది చాలా మందికి. ప్రతీ ఒక్క విషయంలోనూ దీనిపైనే చాలా మంది ఆధారపడుతున్నారు. తాజాగా వెల్లడైన ఓ సర్వేలో ఆశ్చర్యపరిచే అనేక విషయాలు తెలిశాయి. 
 
అదేంటంటే.. ఈ మధ్యకాలంలో చాలామంది యూత్ శృంగారం చేసేందుకు కూడా వీటిపైనే ఆధారపడుతున్నారట.. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.. శృంగారం అంటే.. ఎప్పటికీ కూడా అదో రహస్యమే. ఇప్పుడు కొద్దిగా దాని గురించి మాట్లాడుకుంటున్నారు కానీ, పూర్వ కాలంలో అయితే అది ఉండేది కాదు. అయితే, సోషల్ మీడియాలో చాటింగ్ పెరిగాక టెక్నికల్‌గా అభివృద్ధి చెందాం. దీంతో చాలా విషయాలను కూడా బహిరంగంగానే చర్చించుకుంటున్నారు. 
 
ఇంతకుముందు అంటే కాస్త బెరుగ్గా ఉండేవారు కానీ, రానురాను ప్రతి ఒక్క విషయాన్ని పబ్లిగ్గానే చర్చించుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే శృంగారం గురించి కూడా చాలానే చర్చించుకుంటున్నారు. అయితే తాజాగా మరికొన్ని నిజాలు తెలిశాయి. అవేంటంటే.. శృంగారం గురించి నేటి యూత్ ఏమనుకుంటున్నారు అనే అంశంపై అమెరికాకు చెందిన ఓ సంస్థ సర్వే చేపట్టింది. ఇందులో.. యూత్ చెప్పిన విషయాలు ఆశ్చర్యం కలిగించేలా ఉన్నాయి. శృంగారం గురించి నేటి యూత్ ఎన్నో వింత విషయాలను బయటపెట్టినట్లు చెబుతున్నారు. అసలు అంతలా ఆశ్చర్యపరిచే విషయం ఏంటంటే.. నేటి యూత్ కొన్ని ఫీలింగ్స్‌ని అదుపు చేసుకోలేక అన్ని పనులు ఫోన్‌లోనే కానిచ్చేస్తున్నారట. 
 
అది కూడా వాట్సాప్, సోషల్ మీడియా అప్లికేషన్స్ ద్వారా శృంగారం చాట్ చేసేస్తున్నారు. ఈ చాట్‌కి చాలామంది అలవాటు పడిపోయినట్లు కూడా చాలామంది ఒప్పుకున్నట్లుగా చెబుతున్నారు. కేవలం చాట్ చేయడమే కాదు.. మరి కొంతమంది ఇంకో అడుగు ముందుకేసి నగ్నంగా ఉండే ఫొటోలను ఫోన్ ద్వారా పంపుకుంటున్నారు. అలా పంపే వారి శాతం రోజురోజుకీ పెరిగిపోతుందని చెబుతున్నారు. 
 
ఇలా చేసి తాము తమ పార్టనర్‌కి దూరంగా ఉన్నప్పుడు వాటిని చూస్తూ తృప్తి పడుతున్నారని మరికొంతమంది తెలిపినట్లుగా సర్వేలో తేలిందని చెబుతున్నారు. ఇలాంటి విషయాలను బయటపెట్టిన పరిశోధకులు కొన్ని సూచనలు చేస్తున్నారు. ఇలాంటివి చాలా వరకూ బయటికి వచ్చి ఎంతోమంది జీవితాలు బట్టబయలు అయిపోయాయని.. ఈ కారణంగా చాలామంది ప్రాణాలు కూడా కోల్పోయారని చెబుతున్నారు. ఇది క్రైమ్ రేట్‌ని పెంచుతుందని చెబుతున్నారు. దీన్ని అడ్డుగా పెట్టుకుని చాలామంది సైబర్ నేరాలకు పాల్పడుతున్నట్లుగా తెలిపారు. అందుకే ఇలాంటి అలవాట్లు ఎప్పుడు కూడా మంచిది కాదని చెబుతున్నారు నిపుణులు. కాబట్టి ఇలాంటి వాటి పట్ల ప్రతి ఒక్కరూ అప్రమత్తమవ్వాలని సూచిస్తున్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు