భారతదేశంలో Realme5i లాంచ్... ఫీచర్లేంటో తెలుసా?

గురువారం, 9 జనవరి 2020 (16:52 IST)
భారతదేశంలో రియల్‌మి5ఐ ఫోన్ అందుబాటులోకి వచ్చింది. రియల్‌మి తన నూతన స్మార్ట్‌ఫోన్‌ రియల్‌మి 5ఐని భారత్‌లో ప్రవేశపెట్టింది. ఈ ఫోన్ లాంచింగ్‌ సందర్భంగా ఈ ఫోన్‌ను కొనుగోలు చేసే కస్టమర్లకు పలు ఆఫర్లను అందించనుంది రియల్ మి. మొబిక్విక్‌ ద్వారా చెల్లింపు జరిపితే వెయ్యి రూపాయల వరకు  సూపర్‌ క్యాష్‌ పొందవచ్చు.
 
క్యాషిఫై ద్వారా పాత ఫోన్‌ను ఎక్స్‌ఛేంజ్‌ చేసి ఈ ఫోన్‌ను కొంటే రూ.500 అదనపు ఎక్స్‌ఛేంజ్‌ డిస్కౌంట్‌ను ఇస్తారు.  రూ.8,999 ధరకు ఈ ఫోన్‌ను వినియోగదారులు జనవరి 15వ తేదీ నుంచి ఫ్లిప్‌కార్ట్‌లో కొనుగోలు చేయవచ్చు. 
 
ఫీచర్ల సంగతికి వస్తే.. 
ఇందులో 6.52 ఇంచుల డిస్‌ప్లే, గొరిల్లా గ్లాస్‌ 3 ప్రొటెక్షన్‌, డ్యుయల్‌ సిమ్‌, ఆండ్రాయిడ్‌ 9.0 పై, 12, 8, 2, 2 మెగాపిక్సల్‌ బ్యాక్‌ కెమెరాలు, ఆక్టాకోర్‌ స్నాప్‌డ్రాగన్‌ 665 ప్రాసెసర్‌, 4జీబీ ర్యామ్‌, 64 జీబీ స్టోరేజ్‌, 8 మెగాపిక్సల్‌ సెల్ఫీ కెమెరా, ఫాస్ట్‌ చార్జింగ్, ఫింగర్‌ ప్రింట్‌ సెన్సార్‌, డ్యుయల్‌ 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్‌ 5.0, 5000 ఎంఏహెచ్‌ బ్యాటరీ తదితర ఫీచర్లు వున్నాయి.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు