ఆఫ్గన్‌లో 40 మంది తాలిబన్లు హతం!

ఆఫ్గనిస్థాన్ పశ్చిమ ప్రాంతంలో సోమవారంనాడు అమెరికాకు చెందిన మెరైన్, ఆఫ్గనిస్థాన్ సైనికులు సంయుక్తంగా తాలిబన్ సంస్థకు చెందిన 40 మంది ఉగ్రవాదులను అంతమొందించారు.

ఆఫ్గనిస్థాన్ పశ్చిమ ప్రాంతంలోని ఫారాహ్ ప్రాంతంలోని బాలా బాలుక్‌లో ఆఫ్గనిస్థాన్ సైనికులు, అమెరికా దళాలు సంయుక్తంగా సోమవారంనాడు దాడులు నిర్వహించడంతో అక్కడున్న తాలిబన్ ఉగ్రవాదులు దాదాపు 40 మందిని హతమార్చారని ఆఫ్గనిస్థాన్ సైనిక కమాండర్ జాలాండార్ షా దేహ్‌నామ్ తెలిపారు.

స్థానికుల సూచన మేరకు ఫారాహ్ ప్రాంతంలోని బాలా బాలుక్‌లోనున్న తాలిబన్ ఉగ్రవాదుల శిబిరాలపై దాడులకు పాల్పడ్డామని ఆయన చెప్పారు. తాము అమెరికా సైన్యంతో కలిసి సంయుక్తంగా జరిపిన ఈ దాడుల్లో తాలిబన్ ఉగ్రవాదులు మృతి చెందగా చాలామంది తీవ్రగాయాలపాలైనారన్నారు.

ఈ సందర్భంగా ఆఫ్గన్‌కు చెందిన ఆరుగురు సైనికులు కూడా తీవ్రగాయాల పైలైనట్లు ఆయన పేర్కొన్నారు. గాయాలపాలైన వారిని స్థానిక ఆసుపత్రిలో చేర్పించి చికిత్స చేయిస్తున్నామని, మిగిలిన ఉగ్రవాదులను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టామని ఆయన వివరించారు.

వెబ్దునియా పై చదవండి