ఇండోనేషియాలో తీవ్ర భూకంపం: వేలమంది మృతి

ఇండోనేషియాలోని సుమత్రా ద్వీపంలో గురువారం తీవ్రమైన భూకంపం సంభవించింది. దీంతో వేలమంది ప్రాణాలు పోగొట్టుకున్నారు. అక్కడ జరిగిన భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 7 గా నమోదైంది. అదే అమెరికాలోని భూగర్భ పరిశోధనా సంస్థ పరిశోధన శాఖలోనున్న రిక్టర్ స్కేలుపై 6.8గా నమోదైనట్లు అధికారులు తెలిపారు.

దీనికి ముందు బుధవారం ఇండోనేషియాలోని పేడాంగ్ నగరంలోను భూకంపం సంభవించింది. అక్కడ నెలకొన్న భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 7.6గా నమోదైంది. ఈ భూకంపంలో వేలాదిమంది ప్రాణాలు కోల్పోయారని అధికారులు పేర్కొన్నారు.

గురువారం సంభవించిన భూకంపం తీవ్రతను భూగర్భ పరిశోధనా శాస్త్రజ్ఞులు 7 గా నమోదు చేశారు. ఈ భూకంపం స్థానిక సమయానుసారం ఈ రోజు ఉదయం గం. 8.52నిమిషాలకు (జీఎమ్‌టీ సమయానుసారం రాత్రి ఒంటిగంట 52 నిమిషాలకు) పేడాంగ్ నగరానికి 225 కిలోమీటర్ల ఆగ్నేయంలో సంభవించినట్లు పరిశోధకులు తెలిపారు. అదే అమెరికాకు చెందిన భూగర్భ పరిశోధనా సంస్థ నిర్వహించిన పరిశోధనల్లో భూకంప తీవ్రత అక్కడి రిక్టర్ స్కేలుపై 6.8గా నమోదైనట్లు శాస్త్రజ్ఞులు వెల్లడించారు.

వెబ్దునియా పై చదవండి