దక్షిణ సూడాన్ ఘర్షణల్లో 600 మంది మృతి

ప్రపంచ పటంలో ఇటీవలే ఆవిర్భవించిన దక్షిణ సూడాన్‌‌లో చోటుచేసుకున్న ఘర్షణల్లో సుమారు 600 మంది ప్రజలు మరణించగా వందలాది గాయపడటంతో పాటు పాతిక లక్షలకు పైగా ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలిపోయారని దక్షిణ సూడాన్‌లోని ఐక్యరాజ్యసమితి మిషన్ సోమవారం వెల్లడించింది.

దక్షిణ సూడాన్‌లో ఇటీవలి రోజుల్లో గిరిజనుల మధ్య జరుగుతున్న ఘర్షణలు కేవలం కొన్ని వారాల క్రితం ఖార్టూమ్ నుంచి స్వాతంత్ర్యం పొందిన ఈ ప్రాంత అస్థిరతను సూచిస్తున్నాయని యూఎన్‌ఎంఐఎస్ఎస్‌గా పిలవబడే ఆ దేశంలోని ఐక్యరాజ్యసమితి మిషన్ పేర్కొంది.

జనవరిలో నిర్వహించిన ప్రజాభిప్రాయ సేకరణ ఫలితాలకు అనుగుణంగా సూడాన్ జులై 9న ఉత్తర, దక్షిణ సూడాన్‌లుగా విడిపోయింది. సూడాన్‌లోని ఉత్తర, దక్షిణ ప్రాంతాల ప్రజల మధ్య దశాబ్దాల పాటు జరిగిన పౌర యుద్ధం 2005లో కుదిరిన శాంతి ఒప్పందంతో ముగిసింది.

వెబ్దునియా పై చదవండి