నిఘా శాఖ మంత్రిని తొలగించిన నెజాద్

ఇరాన్ అధ్యక్షుడు మహమౌద్ అహ్మదీనెజాద్ ఆదివారం ఆ దేశ నిఘా శాఖ మంత్రిని తొలగించారు. ఇదిలా ఉంటే ముందురోజు ఇరాన్ అతివాద పెద్దలు తొలి ఉపాధ్యక్ష పదవికి నెజాద్ ప్రతిపాదించిన నేత విషయంలో అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో నెజాద్ ఈ ప్రతిపాదనను ఉపసంహరించుకోవాల్సి వచ్చింది.

తాజాగా అహ్మదీనెజాద్ దేశ నిఘా శాఖ మంత్రిత్వ బాధ్యతల నుంచి గులాం హుస్సేన్ మొహ్సానీ ఎజెజేని తొలగించారు. దీనికి అధికారికంగా ఎటువంటి కారణాలు వెల్లడించలేదు. కొన్ని వారాల క్రితం దేశంలో జరిగిన వివాదాస్పద అధ్యక్ష ఎన్నికల్లో అహ్మదీనెజాద్ ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే.

ఈ ఎన్నికల్లో విజయంతో వరుసగా రెండోసారి అధ్యక్ష పగ్గాలు చేపట్టేందుకు మార్గం సుగమం చేసుకున్న నెజాద్ ప్రస్తుతం కేబినెట్ కూర్పుపై కసరత్తులు చేస్తున్నారు. ఇరాన్ స్థానిక పత్రికలు నలుగురు కేంద్ర మంత్రులను తొలగించినట్లు వెల్లడించినప్పటికీ, అధ్యక్ష కార్యాలయం మాత్రం ఈ వార్తలను తోసిపుచ్చింది. ఎజెజేని మాత్రమే తొలగించినట్లు నెజాద్ కార్యాలయం వెల్లడించింది.

వెబ్దునియా పై చదవండి