పశ్చిమ సోమోవాలో సునామీ: వందమంది మృతి

పశ్చిమ సోమావోలో సునామీ మరోసారి విరుచుకుపడింది. సునామీ తాకిడికి ఇప్పటి వరకూ వంద మంది మృతి చెందినట్లు ప్రాథమిక సమాచారం. చాలా మంది తీవ్ర గాయాలపాలైనట్లు అధికార వర్గాలు పేర్కొన్నాయి.

అమెరికా తీరంలోని ఓ గ్రామం కొట్టుకుపోవడంతో వేలాదిమంది నిరాశ్రయులయ్యారు. రిక్టరు స్కేలుపైసునామీ ప్రభాం 8.3గా నమోదైందని భూగర్భ పరిశోధన శాఖాధికారులు తెలిపారు.

సునామీ ప్రభావిత ప్రాంతాల్లో ముమ్మరంగా సహాయక చర్యలు చేపట్టినట్లు పశ్చిమ సోమోవాకు చెందిన అధికారి ఆస్‌గేలియా మలీపోలా తెలిపారు. దేశంలోని ఆగ్నేయ ప్రాంతంలోనున్న చాలా గ్రామాలు జలమయమైనాయని ఆయన తెలిపారు.

వెబ్దునియా పై చదవండి