పాకిస్థాన్‌లో అతి పెద్ద నగరం, వాణిజ్య రాజధాని కరాచీలో తెగల మధ్య నిరంతరాయంగా జరుగుతున్న హింసలో మంగళవారం కూడా సుమారు 27 మంది మరణించారు. ఈ హింసలో శుక్రవారం నుంచి 52 మంది ప్రజలు చనిపోయారు. కాగా పాకిస్థాన్ అంతర్గత శాఖ మాత్రం త్వరలోనే శాంతి నెలకొంటుందని చెబుతున్నది.
తెగల మధ్య జరుగుతున్న హింసలో ఒక్క జులై నెలలోనే 313 మంది మరణించినట్లు మీడియా నివేదికలు చెబుతున్నాయి. 2011 తొలి ఆరు నెలల్లో కరాచీలో 1,113 మంది ప్రజలు చనిపోయినట్లు పాకిస్థాన్ మానవహక్కుల సంఘం ప్రకటించింది. కరాచీ హింసకు రాజకీయ పరిష్కారం కనుగొనాలని మానవ హక్కుల సంఘం మరో ప్రకటనలో కోరింది.
దాయాది దేశం పాకిస్థాన్‌లో ఒకవైపు తీవ్రవాదులు పెచ్చరిల్లిపోవడం, మరోవైపు తెగల మధ్య జరుగుతున్న హింస భారత్‌కు తీవ్ర ఆందోళన గురిచేస్తున్నది.