పాక్ కోసం అమెరికా కొత్త మార్గాల అన్వేషణ

పాకిస్థాన్‌కు సాయం అందించేందుకు అమెరికా ప్రభుత్వం కొత్త మార్గాల అన్వేషణపై దృష్టి పెట్టింది. అమెరికా అందిస్తున్న సాయాన్ని భారత్‌కు పోటీగా ఆయుధాలు తయారు చేయడంపై పాకిస్థాన్ వెచ్చిస్తుందని ఆరోపణలు వ్యక్తమవుతున్న సంగతి తెలిసిందే. దీనిపై భారత్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తోంది.

ఈ నేపథ్యంలో తాము అధికారిక మార్గాల్లో అందిస్తున్న సాయం పాక్ ప్రజల సంక్షేమానికి ఉపయోగపడటం లేదని అమెరికా కూడా భావిస్తోంది. దీంతో ఒబామా యంత్రాంగం పాకిస్థాన్‌కు అందిస్తున్న సాయాన్ని సమర్థవంతంగా, ఉద్దేశించిన ప్రయోజనాలకు ఉపయోగపడేలా చూసేందుకు కొత్త మార్గాలు అన్వేషిస్తోంది.

పాకిస్థాన్‌కు అమెరికా అందజేస్తున్న సాయం ఆ దేశం ఇతర దేశాలపై ఆయుధ పోటీకి ఉపయోగించకుండా చూడాలని భారత్ డిమాండ్ చేస్తోంది. ఈ సాయాన్ని అమెరికా పర్యవేక్షించాల్సి ఉందని భారత ప్రభుత్వం భావిస్తోంది. పాకిస్థాన్ ప్రభుత్వానికి నేరుగా మొత్తం ఆర్థిక సాయం వెళుతుండటం ఒబామా యంత్రాంగానికి కూడా సంతృప్తికరంగా లేదని తెలుస్తోంది.

వెబ్దునియా పై చదవండి