ఫిలిప్పీన్స్ వరద భీభత్సం: 240 మంది మృతి

ఫిలిప్పీన్స్‌లో వరదలు భీభత్సం సృష్టిస్తున్నాయి. వీటికి సంబంధించిన ప్రమాదాల్లో ఇప్పటివరకు 240 మంది మృత్యువాత పడ్డారని ఆ దేశ అధికారిక యంత్రాంగం వెల్లడించింది. ముందురోజు మృతుల సంఖ్య వంద వద్ద ఉన్నప్పటికీ, సోమవారం సంఖ్య బాగా పెరిగింది. భారీ వరదల కారణంగా ఫిలిప్పీన్స్ రాజధాని మనీలాలోనే 90 మరణాలు సంభవించాయి.

మనీలాలో మరణాలు వెలుగుచూడటంతో మృతుల సంఖ్య అమాంతం పెరిగిందని జాతీవ విపత్తు సమన్వయ మండలి అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు. కెత్సానా తుపాను కారణంగా ఫిలిప్పీన్స్‌లో భారీ వర్షాలు కురిశాయి. గత 40 ఏళ్లలో ఫిలిప్పీన్స్‌లో ఇంత భారీ స్థాయిలో వర్షాలు కురవడం ఇదే తొలిసారి. ఈ తుపాను కారణంగా శనివారం మనీలా, దీని పరిసరాల్లోని లుజోన్ ద్వీపంలో భారీ వర్షాలు కురిశాయి.

వెబ్దునియా పై చదవండి