భారత్‌తో చర్చలకు కట్టుబడి ఉన్నాం: పాకిస్థాన్

దక్షిణాసియా ప్రాంతంలో సమస్యల పరిష్కారానికి యుద్ధం మార్గం కాదని పాకిస్థాన్ విదేశాంగ శాఖ మంత్రి షా మహమూద్ ఖురేషి అభిప్రాయపడ్డారు. భారత్, పాకిస్థాన్ మధ్య ద్వైపాక్షిక సంబంధాలు ముందుకు తీసుకెళ్లేందుకు చర్చలొక్కటే మార్గమని పేర్కొన్నారు. భారత్‌తో చర్చల ప్రక్రియ పునరుద్ధరణకు పాక్ ప్రభుత్వం కట్టుబడి ఉందని ఉద్ఘాటించారు.

పరస్పర సహకారం, చర్చలే సమస్యల పరిష్కారానికి ఏకైక మార్గమని, దీని ద్వారా ఇరుదేశాల ప్రయోజనాలను కాపాడవచ్చని ఖురేషి మంగళవారం ఇస్లామాబాద్‌లోని ఫారిన్ ఆఫీస్ ట్రైనింగ్ అకాడమీలో జరిగిన ఓ వేడుకలో పాల్గొన్న సందర్భంగా విలేకరులతో చెప్పారు. అన్ని వివాదాలకు చర్చల ద్వారా పరిష్కారం కనుగొనవచ్చన్నారు.

వెబ్దునియా పై చదవండి