యూస్ డ్రోన్ దాడిలో ఐదుగురు తీవ్రవాదుల హతం

పాకిస్థాన్‌లోని దక్షిణ వజిరిస్థాన్ గిరిజన ప్రాంతంలో అమెరికా దళాలు సోమవారం మానవ రహిత డ్రోన్ యుద్ధ విమానంతో ఒక వాహనం లక్ష్యంగా జరిపిన దాడిలో తీవ్రవాదులుగా అనుమానిస్తున్న ఐదుగురు మృతి చెందగా ఇతరులు అనేక మంది గాయపడ్డారు.

అమెరికా గూఢాచార సంస్థ సీఐఏ ఆధ్వర్యంలో దక్షిణ వజిరిస్థాన్‌ ఏజెన్సీలోని బిర్మల్ ఏరియాలో డ్రోన్ దాడి జరిగినట్లు స్థానిక వార్తా ఛానెళ్లు తెలిపాయి. ఈ దాడిలో వాహనం పూర్తిగా ధ్వంసమయింది. మృతి చెందిన వారి వివరాలు వెనువెంటనే తెలియరాలేదు.

తీవ్రవాదుల ఏరివేతకు గానూ గిరిజన ప్రాంతంలో అమెరికా చేపడుతున్న డ్రోన్ దాడులపై పాకిస్థాన్ తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేస్తున్నది. ఈ దాడుల్లో పెద్ద సంఖ్యలో సామాన్య ప్రజలు మృత్యువాత పడుతున్నారు. తాజాగా ఐఎస్ఐ ఛీఫ్ కూడా డ్రోన్ దాడులు ఆపాలని సీఐఏ డైరక్టర్‌ను కోరారు.

వెబ్దునియా పై చదవండి