వలీ కర్జాయ్‌ని చంపింది తాలిబాన్లు కాదు సహచరుడే

ఆఫ్ఘనిస్థాన్ అధ్యక్షుడు హమీద్ కర్జాయ్ సవతి సోదరుడు అహ్మద్ వలీ కర్జాయ్‌ని వ్యక్తిగత విభేధం కారణంగా అతని సహచరుడే చంపాడని తాలిబాన్లు హతమార్చలేదని పాశ్చాత్య అధికారి ఒకరు పేర్కొన్నారు. జులై 12న అహ్మద్ వలీ కర్జాయ్‌ హత్యకు తామే బాధ్యులమని తాలిబాన్లు అంతకు ముందుకు ప్రకటించుకున్నారు.

హత్య జరిగిన పరిస్థితులను పరిశీలించిన అధికారులు అహ్మద్ మృతికి తాలిబాన్లు కాదని నిర్ధారించారని ఆ అధికారి తెలిపారు. వలీ కర్జాయ్ కుటుంబానికి నమ్మినబంటుగా వున్న అంగరక్షుడు సర్దార్ మొహమ్మద్ ఈ హత్య చేసినట్లు గుర్తించారు.

దక్షిణ ఆఫ్ఘనిస్థాన్‌లో అత్యంత శక్తివంతమైన నాయకుడైన అహ్మద్ వలీ కర్జాయ్ హత్యచేయబడే సమయానికి కాందహార్ ఫ్రొవిన్షియల్ కౌన్సిల్ ఛైర్మన్‌గా వున్నారు. మాదక ద్రవ్యాల వ్యాపారం చేసే వలీ కర్జాయ్ ఆఫ్ఘనిస్థాన్ ప్రభుత్వంలో అత్యంత అవినీతిపరుడిగా పేరుగాంచారు.

వెబ్దునియా పై చదవండి