శరణార్థులకు అనుమతి మంజూరు: ఒబామా

ప్రపంచవ్యాప్తంగా అమెరికా వచ్చిన దాదాపు 80 వేల మంది శరణార్థులకు ప్రవేశానుమతి కల్పిస్తూ అమెరికా అధ్యక్షుడు బరాక్ హుస్సేన్ ఒబామా సమ్మతించినట్లు వైట్‌హౌస్ ప్రకటించింది.

తమ దేశంలోకి వచ్చిన శరణార్థులకు తమ దేశాధ్యక్షుడు ఒబామా ప్రవేశానుమతినిచ్చినట్లు వైట్‌హౌస్ ఓ ప్రకటనలో తెలిపింది. కొన్ని విపత్కర పరిస్థితుల్లో ప్రపంచవ్యాప్తంగా తమ దేశానికి వచ్చిన శరణార్థులను ఆదుకునే పక్షంలో అమెరికా సిద్ధంగా ఉందని, ఇది ఓ చారిత్రాత్మకమైన విప్లవమని ఒబామా అన్నట్లు వైట్‌హౌస్ పేర్కొంది.

ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న ఆర్థిక మాంద్యం కారణంగా రకరకాల సమస్యలు ఉత్పన్నమైనాయని, దీంతో ప్రపంచంలోని పలు దేశాలనుంచి శరణార్థులు తమ దేశంలోకి వచ్చారని, వారిని ఆదుకోవడం తమ ప్రథమ కర్తవ్యమని అమెరికా భావించింది.

దాదాపు తూర్పు మరియు దక్షిణాసియా నుంచి 35 వేలమంది శరణార్థులతోపాటు ఆఫ్రికానుంచి 15500 మంది, తూర్పు ఆసియా నుంచి 17 వేలు, లాటిన్ అమెరికా మరియు కైరోబియా దేశాలనుంచి చెరి ఐదు వేలమంది శరణార్థులకు తమ దేశంలో ఉండేందుకు తాము అనుమతినిచ్చామని, మరో ఐదు వేలమందిని ప్రత్యేకంగా ఉంచి విచారించనున్నట్లు అమెరికా ప్రకటించింది.

వెబ్దునియా పై చదవండి