సుఫీ మొహమ్మద్‌పై విచారణ ప్రారంభం

పాకిస్థాన్ అధికారిక యంత్రాంగం తాలిబాన్ అనుకూలవాద మతపెద్ద సుఫీ మొహమ్మద్‌పై విచారణ ప్రారంభించింది. పాకిస్థాన్‌లోని సమస్యాత్మక నార్త్‌వెస్ట్ ఫ్రాంటియర్ ప్రావీన్స్ రాజధాని పెషావర్‌లో ఆదివారం పాక్ భద్రతా యంత్రాంగం సుఫీ మొహమ్మద్‌ను, ఆయన ఇద్దరు కుమారులను, వారి అనుచరుడిని అరెస్టు చేసిన సంగతి తెలిసిందే.

సమస్యాత్మక స్వాత్ లోయతోపాటు, మొత్తం మలకాండ్ ప్రాంతంలో తీవ్రవాదాన్ని, హింసాకాండను ప్రేరేపించడంతోపాటు, ప్రభుత్వానికి వ్యతిరేక వ్యాఖ్యలు చేస్తున్నారనే ఆరోపణలపై ఆయనను భద్రతా యంత్రాంగం అదుపులోకి తీసుకుంది. స్వాత్ తాలిబాన్ కమాండర్ బైతుల్లా మెహసూద్ మామ అయిన సుఫీ మొహమ్మద్‌ను అధికారులు గుర్తు తెలియని ప్రదేశంలో విచారిస్తున్నారు.

వెబ్దునియా పై చదవండి