పాకిస్థాన్ అధ్యక్షుడు ఆసిఫ్ అలీ జర్దారీ హురియత్ ఛైర్మెన్ మిర్వాజ్ ఓమర్ ఫరూఖ్‌తో మంగళవారం భేటీ అయ్యారు.
పాక్ అధ్యక్షుడు జర్దారీ హురియత్ కాన్ఫరెన్స్ ఛైర్మెన్ మిర్వాజ్ ఓమర్ ఫరూఖ్‌తో మంగళవారంనాడు భేటీ అయినట్లు పాక్ ఉన్నతాధికారులు తెలిపారు. వీరిరువురు దాదాపు 30 నిమిషాలపాటు సమావేశమైనట్లు సమాచారం.
ప్రస్తుతం కాశ్మీర్‌లో ఉన్న పరిస్థితులపై వీరు చర్చించినట్లు అలాగే ఆల్ పార్టీస్ హురియత్ కాన్ఫరెన్స్‌కు సంబంధించిన విషయాలను ఫరూఖ్ జర్దారీకి వివరించినట్లు అధికారులు పేర్కొన్నారు.
ఇటీవలే పాకిస్థాన్ విదేశాంగ శాఖామంత్రి భారత విదేశాంగ శాఖామంత్రి ఎస్.ఎమ్.కృష్ణను కలిసిన తర్వాత ఫరూఖ్ ఆయనతో సంప్రదింపులు జరిపారు.
ఫరూఖ్‍తో సంప్రదింపులు జరిపిన తర్వాత కాశ్మీర్ సమస్యను సానుకూలంగా పరిష్కరించుకోవాలని తాము భావిస్తున్నట్లు పాక్ విదేశాంగ శాఖామంత్రి ముహమ్మద్ ఖురేషీ విలేకరులకు తెలిపారు.