రాజకీయంగా మీ టార్గెట్ ఏమిటో తెలుసుకోవాలనుంది?
ప్రజలకు ఇంకా మెరుగైన నాణ్యమైన జీవితాన్ని అందించాలన్నదే నా టార్గెట్. మనకున్న వనరులు, మనకున్న సహజ సంపద చూసుకుంటే ప్రజలు ఇంత అధ్వాన్న స్థితిలో వుండే అవకాశం లేదు. సంపాదించేవాళ్లు కోట్లు సంపాదిస్తున్నారు. ధనవంతులు ఇంకా ధనవంతులైపోతున్నారు. పేదవాళ్లు ఇంకా నిరుపేదలుగానే వున్నారు. అంతరాలు తగ్గిపోవాలంటే సహజమైన సంపద, వనరులు అందరికీ సమపాళ్ళలో అందాలి. అవి చేయాలంటే సామాజిక న్యాయం జరగాలి. నా లక్ష్యం అదే.
రాజకీయాల్లో ఇన్‌స్పిరేషన్‌గా నిలిచే వ్యక్తి ఎవరు?
ఒళ్లు దాచుకోకుండా కష్టపడి తన బాగుతోపాటు పదిమంది బాగుండాలని కోరుకోనేవారెవరైనా సరే.. నీతి నిజాయితీలకు కట్టుబడి సమాజ శ్రేయస్సు తన శ్రేయస్సుగా భావించే ఏ వ్యక్తయినా నాకు ఆదర్శనమే.