ఐపీఎల్ పదో సీజన్ క్వాలిఫయర్-1 పోరులో భాగంగా ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రైజింగ్ పుణె సూపర్ జెయింట్ అదరగొట్టింది. ముంబైపై గెలిచి ఫైనల్‌కు చేరింది. బౌలింగ్, బ్యాటింగ్‌లో రాణించిన ఆజట్టు 20 పరుగుల తేడాతో ముంబైని ఓడించింది. ఫలితంగా ఐపీఎల్ పదో సీజన్ చాంపియన్‌గా నిలిచేందుకు పుణె అడుగు దూరంలో నిలిచింది.
పుణె నిర్దేశించిన 163 పరుగుల లక్ష్య ఛేదనలో వాషింగ్టన్ సుందర్ (4-0-16-3) ధాటికి ముంబై ఓవర్లన్నీ ఆడి 9 వికెట్లకు 142 రన్స్ మాత్రమే చేయగలిగింది. పార్థివ్ పటేల్ (40 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్సర్లతో 52) ఒంటరి పోరాటం నిష్ఫలమైంది. మిగతా బ్యాట్స్‌మెన్ పూర్తిగా విఫలమయ్యారు. ఠాకూర్ (3/37) మూడు వికెట్లతో సత్తా చాటాడు.
మొదట బ్యాటింగ్ చేసిన పుణె నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్లకు 162 పరుగులు చేసింది. మనోజ్ తివారి (48 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సర్లతో 58), అజింక్యా రహానే (43 బంతుల్లో 5 ఫోర్లు, సిక్సర్‌తో 56) అర్థ శతకాలతో ఆకట్టుకోగా.. ఆఖర్లో ధోనీ (26 బంతుల్లో 5 సిక్సర్లతో 40 నాటౌట్) ధనాధన్ బ్యాటింగ్‌తో చెలరేగిపోయాడు.