ఉప్పల్‌లో ఐపీల్ 10 ప్రారంభ మ్యాచ్ : భద్రతలో 1800 పోలీసులు...

ఇండియన్ ప్రీమియర్ లీగ్ పదో ఎడిషన్ పోటీలు ఈనెల 5వ తేదీ నుంచి ప్రారంభంకానున్నాయి. ఉప్పల్‌లోని హైద‌రాబాద్‌లోని రాజీవ్ గాంధీ ఇంట‌ర్నేష‌నల్ క్రికెట్ స్టేడియంలో మొద‌టి మ్యాచ్ జ‌ర‌గ‌నుంది. 
 
ఈ పరిస్థితుల్లో రాచకొండ కమిషనరేట్ కమిషనర్ మహేశ్ భగవత్ సోమవారం మీడియాతో మాట్లాడుతూ... నగరంలో మొత్తం 8 ఐపీఎల్ మ్యాచ్‌లు జరుగుతాయని, ఈ మ్యాచ్‌లన్నింటికీ గట్టి భద్రతను కల్పిస్తామని ఆయన తెలిపారు. 
 
భద్రత కోసం ఏకంగా 1800 మంది పోలీసులు, 88 సీసీ కెమెరాలతో భద్రతా ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు. అలాగే, ఈ మ్యాచ్‌లకు ప్రత్యేక షీ బృందాలను కూడా ఏర్పాటు చేసినట్లు తెలిపారు. మ్యాచ్ జరిగే సమయంలో స్టేడియంలోకి కేవలం మొబైల్ ఫోన్లు మాత్రమే అనుమతిస్తామని, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలు అనుమతించబోమ‌ని స్పష్టం చేశారు. 

వెబ్దునియా పై చదవండి