ముఖ్యంగా, సీఎస్కే జట్టు ఓపెనర్ షేన్ వాట్సన్ (57 బంతుల్లో 106, 9ఫోర్లు, 6సిక్స్‌లు) సెంచరీతో చెన్నై 20 ఓవర్లలో 204/5 స్కోరు చేసింది. గోపాల్(3/20) మూడు వికెట్లు దక్కాయి. ఆ తర్వాత లక్ష్యఛేదనలో రాజస్థాన్ 18.3 ఓవర్లలో 140 స్కోరుకే పరిమితమైంది. బెన్‌స్టోక్స్(45) మినహా ఎవరూ రాణించలేకపోయారు. చాహర్(2/30), శార్దుల్(2/18), బ్రావో(2/16), కర్ణ్‌శర్మ(2/13) రెండేసి వికెట్లతో రాణించారు.
ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ధనాధన్ ఇన్నింగ్స్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. సీనియర్ ఆల్‌రౌండర్ షేన్ వాట్సన్(57 బంతుల్లో 106, 9 ఫోర్లు, 6 సిక్స్‌లు) వీరవీహారం చేసిన వేళ చెన్నై నిర్ణీత 20 ఓవర్లలో 204/5 భారీ స్కోరు నమోదుచేసింది. గాయం నుంచి తేరుకుని తిరిగి జట్టులోకి వచ్చిన రైనా(29 బంతుల్లో 49, 9ఫోర్లు)కీలక ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్నాడు.
ఆ తర్వాత లక్ష్యఛేదన రాజస్థాన్‌కు అంతగా కలిసిరాలేదు. చెన్నై బౌలర్లు కట్టుదిట్టమైన బౌలింగ్‌తో చెలరేగడంతో రాజస్థాన్ టపాటపా వికెట్లు చేజార్చుకుంది. ఈ సీజన్‌లో తొలి మ్యాచ్ ఆడుతున్న క్లాసెన్(7) పూర్తిగా నిరాశపరిచాడు. అలాగే, శాంసన్(2) నిరాశపరుస్తూ చాహర్ షార్ట్‌పిచ్ బంతికి బలయ్యాడు.
మరోవైపు ఆదిలో బౌండరీలతో ఆకట్టుకున్న కెప్టెన్ రహానే(16) కూడా.. చాహర్ నకుల్ బంతికి వికెట్ సమర్పించుకున్నాడు. దీంతో రాజస్థాన్ 32 పరుగులకే 3 కీలక వికెట్లు కోల్పోయింది. ఈ దశలో స్టోక్స్(45), బట్లర్(22) ఇన్నింగ్స్‌ను చక్కదిద్దే ప్రయత్నం చేశారు. అయితే బ్రావో వేసిన తొలి బంతికే..బట్లర్ ఔట్ కావడంతో నాలుగో వికెట్‌కు 45 పరుగుల భాగస్వామ్యానికి బ్రేక్ పడింది. ఇక్కణ్నుంచి రాజస్థాన్ ఏ దశలోనూ కోలుకోలేకపోయింది. 63 పరుగుల తేడాతో ఆఖరి ఆరు వికెట్లు కోల్పోయింది. ఫలితంగా రాజస్థాన్ జట్టు 18.3 ఓవర్లలో 140 స్కోరుకే పరిమితమైంది.