ఐపీఎల్ 2018 టోర్నీలో భాగంగా, ఆదివారం జరిగిన మరో మ్యాచ్‌లో పంజాబ్ జట్టు విజయభేరీ మోగించింది. ఇండోర్‌లోని వోల్కర్ స్టేడియం వేదికగా జరిగిన మ్యాచ్‌లో కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ తన ప్రత్యర్థఇ అయిన రాజస్థాన్ రాయల్స్ జట్టుపై 6 వికెట్ల తేడాతో గెలుపొందింది.
ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లకు 152 పరుగులు చేసింది. 153 పరుగుల విజయ లక్ష్యంతో బ్యాటింగ్ చేపట్టిన పంజాబ్… కేఎల్ రాహుల్ అద్భుత బ్యాటింగ్‌తో ఆరు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. రాహుల్ 54 బంతుల్లో 7 ఫోర్లు 3 సిక్సర్లతో 84 పరుగులతో అజేయంగా నిలిచి పంజాబ్‌ను ఒంటి చేత్తో గెలిపించాడు. ఐపీఎల్‌లో రాహుల్‌కు ఇదే అత్యధిక స్కోరు.