కోహ్లీ సేనకు ఆ ఛాన్సుందా..? ప్లే ఆఫ్‌కు అర్హత సాధించాలంటే.. ఏం చేయాలి?

మంగళవారం, 30 ఏప్రియల్ 2019 (11:42 IST)
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 12వ సీజన్‌లో కోహ్లీ సారథ్యంలోని బెంగళూరు జట్టు ఈ టోర్నీ నుంచి దాదాపు నిష్క్రమించినట్టే అనుకున్నారు చాలామంది. అయినా బెంగళూరు జట్టుకో ప్లే ఆఫ్ అర్హత సాధించేందుకు ఓ ఛాన్సుందట. ఇప్పటికే చెన్నై సూపర్ కింగ్స్‌తో పాటు ఢిల్లీ కాపిటల్స్ జట్టు ప్లే ఆఫ్‌కు అర్హత సాధించాయి. ఇక మిగిలిన ఆరు జట్లలో రెండు జట్లు ప్లే ఆఫ్‌కు వెళ్తాయి. 
 
ఈ ఆరు జట్లలో ముంబై ఇండియన్స్ ముందున్నప్పటికీ సాంకేతికంగా అన్ని జట్లకూ అవకాశం వుంది. ఈ క్రమంలో 12 మ్యాచ్‌లు ఆడి కేవలం 8 పాయింట్ల  పట్టికలో చివరి స్థానంలో వున్న బెంగళూరు దాదాపు నిష్క్రమించినా.. ఆ జట్టుకు ఛాన్సు వస్తుంది. అదెలాగంటే.. కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టు కోల్ కతా చేతిలో ఓడిపోయి, చెన్నైపై గెలవాలి. 
 
ముంబై ఇండియన్స్ జట్టు కోల్ కతా, సన్ రైజర్స్‌లపై గెలవాలి. రాజస్థాన్ జట్టు బెంగళూరు చేతిలో ఓడిపోయి, ఢిల్లీపై గెలవాలి. ఆపై బెంగళూరు తన ఆఖరి మ్యాచ్‌లో హైదరాబాద్‌ను భారీ తేడాతో ఓడించాలి. 
 
అదే జరిగితే, కోల్‌ కతా నైట్ రైడర్స్, కింగ్స్ ఎలెవన్ పంజాబ్, సన్ రైజర్స్ హైదరాబాద్‌, రాజస్థాన్‌ రాయల్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్లన్నింటికీ పన్నెండేసి పాయింట్లు ఉంటాయి. అప్పుడు మెరుగైన నెట్ రన్ రేట్ ఉన్న జట్టు ప్లే ఆఫ్ కు వెళుతుంది. నెట్ రన్ రేట్ బాగుంటే కోహ్లీ సేన వెళ్తుందని ఐపీఎల్ వెల్లడించింది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు