రైనా సిక్సర్ మిస్.. ధోనీ స్టంపింగ్ అదుర్స్..

బుధవారం, 10 ఏప్రియల్ 2019 (17:55 IST)
చెన్నై సూపర్ కింగ్స్, కోల్‌కతా నైట్ రైడర్స్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో 109 పరుగుల లక్ష్యాన్ని చేధించే క్రమంలో చెన్నై 17.2 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 111 పరుగులతో గెలుపును నమోదు చేసుకుంది. ఇందులో అత్యధికంగా డుప్లెసిస్ 43 పరుగులు సాధించాడు. ఇందులో సురేష్ రైనా 14 పరుగులు సాధించిన సమయంలో సునీల్ నరేన్ విసిరిన బంతిని పియూష్ చావ్లాకు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. 
 
చెన్నైసూపర్‌ కింగ్స్‌- కోల్‌కతా నైట్‌రైడర్స్‌ మధ్య మంగళవారం రాత్రి జరిగిన మ్యాచ్‌లో ధోనీ మరోసారి తన స్టంపింగ్‌ చాతుర్యాన్ని ప్రదర్శించాడు. మెరుపు వేగంతో శుభ్‌మన్‌గిల్‌ను స్టంపౌట్‌ చేసి అభిమానులనే కాకుండా కోల్‌కతా యజమాని షారుఖ్‌ఖాన్‌ను కూడా ఆశ్చర్యానికి గురిచేశాడు. మ్యాచ్‌ 11వ ఓవర్‌లో ఇమ్రాన్‌ తాహిర్‌ వేసిన బంతిని శుభమన్‌గిల్‌ ఆడేందుకు ప్రయత్నించాడు. బ్యాట్‌కు తగలకుండా బంతి వికెట్‌కీపర్‌ ధోనీ చేతికి చిక్కింది. 
 
అప్పటికే బ్యాట్స్‌మన్‌ శుభ్‌మన్‌గిల్‌ క్రీజు వదిలేసరికి ముందుకు వెళ్లడంతో ధోనీ మెరుపు వేగంతో స్టంపింగ్‌ చేశాడు. దీంతో శుభ్‌మన్‌ పెవిలియన్‌ చేరాల్సి వచ్చింది. అయితే మ్యాచ్‌ ప్రత్యక్షంగా చూడ్డానికి వచ్చిన షారుఖ్‌ ధోనీ స్టంపింగ్‌ చూసి షాక్ అయ్యాడు. ఈ వీడియో ప్రస్తుతం ఆన్‌లైన్‌లో వైరల్‌గా మారింది. దీంతో ధోనీ అభిమానులు తెగ సంబరపడిపోతున్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు