ఇప్పుడు ఐపీఎల్లో సీఎస్కేకు ఆడుతున్న ధోని.. వచ్చీ రాగానే బ్యాట్‌కు ఎలా పని చెప్పగలడు. అందుకే తనను తాను బ్యాటింగ్‌లో డిమోషన్ కల్పించుకొని ఏడో స్థానంలో వస్తున్నాడు. అంతేగాక దుబాయ్‌కు చేరుకోగానే నేరుగా ప్రాక్టీస్ చేయకుండా క్వారంటైన్లో ఉండడంతో అతనికి ఎక్కువ ప్రాక్టీస్ చేసే అవకాశం లేదు.. అందుకే ఏడో స్థానం అనే నిర్ణయం తీసుకున్నాడు. అయినా ధోని నిర్ణయాలు ఎప్పుడు షాకింగ్‌గానే కనిపిస్తాయి.
ధైర్యసాహసాలు, మూర్ఖత్వం మధ్య ఒక సన్నని గీత.. అలాగే జాగ్రత్త, భయం అనే పదాలను వేరు చేసే సన్నని గీతలను కెప్టెన్‌గా ధోని ఎప్పుడో దాటేశాడు. ఐపీఎల్ తొలిదశలోనే ధోని నిర్ణయాలను తప్పుబట్టడం సరికాదు. కేవలం ఒక మ్యాచ్ గెలిపించలేకపోయాడనే సాకుతో ధోనిని విమర్శించడం తప్పు.. అతని నాయకత్వ పటిమ ఎప్పటికి చెరిగిపోదు. ధోని తన నిర్ణయాలను ఇప్పుడిప్పుడే అమలు చేస్తున్నాడు.. అయినా ఆర్ఆర్తో జరిగిన మ్యాచ్‌లో ధోని మూడు సిక్సర్లు కొట్టాడంటే అతను ఫామ్‌లో ఉన్నట్లేనని ఆకాశ్ చోప్రా అన్నాడు.