మొదటి మ్యాచ్‌లో 0, ఆ తర్వాతి మ్యాచ్‌లో 5 పరుగులే చేశాడు. ఆ తర్వాతి అతడిని జట్టులోకి తీసుకోలేదు. కుర్రాళ్లలో స్పార్క్ కనిపించడం లేదని అందుకే చెన్నై ప్రదర్శన బాగాలేదని ధోనీ వ్యాఖ్యానించడంతో పెద్ద ఎత్తున దుమారం రేగింది. ముంబైతో జరిగిన మ్యాచ్‌లో మరోసారి డకౌట్ అయ్యాడు రుతురాజ్. దాంతో అతడిపై సోషల్ మీడియాలో ట్రోలింగ్ జరిగింది. ధోనీ చెప్పింది నిజమే.. కనీసం ఆడాలన్న ఓపిక కూడా రుతురాజ్‌కు లేదని విమర్శలు గుప్పించారు.
ఐతే ఆ తర్వాత మ్యాచ్ నుంచి తన సత్తా ఏంటో చూపించాడు రుతురాజ్. తనని విమర్శించిన వారే ప్రశంసించేలా అద్భుతంగా రాణించాడు. వరుసగా మూడు మ్యాచ్‌ల్లో అర్ధ సెంచరీలు చేసి.. మూడు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌లు గెలిచాడు. మొదటి మూడు మ్యాచ్‌ల్లో 0, 5, 0 పరుగులు చేసిన రుతురాజ్... ఆ తర్వాతి మూడు మ్యాచ్‌ల్లో 65*, 72, 62* పరుగులు చేసి శభాష్ అనిపించాడు. దాంతో రుతురాజ్‌కు మద్దతుగా సోషల్ మీడియాలో అభిమానులు ట్వీట్ల మోత మోగిస్తున్నారు. వచ్చే ఏడాది ఐపీఎల్ కోసం చెన్నై జట్టుకు అద్భుతమైన ప్లేయర్ దొరికాడని ప్రశంసలు కురిపిస్తున్నారు.