రిటైర్మెంట్ తర్వాత సిక్సర్ల వర్షం కురిపించిన ధోనీ...

శుక్రవారం, 21 ఆగస్టు 2020 (16:53 IST)
భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్, చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ మరోమారు సత్తా చాటాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ 11వ సీజన్ పోటీలకు సన్నాహక శిబిరాన్ని చెన్నైలోని చిదంబరం స్టేడియంలో నిర్వహిస్తున్నారు. ఈ స్టేడియంలో ఐపీఎల్ జట్టు సభ్యులు ముమ్మర సాధనలో నిమగ్నమైవున్నారు. 
 
ఇందులోభాగంగా, ప్రాక్టీస్ కోసం నిర్వహించిన నెట్ ప్రాక్టీసు సెషన్‌లో ధోనీ రెచ్చిపోయాడు. బంతిని బలంగా బాదుతూ స్డాండ్స్‌లోకి పంపాడు. మునుపటి స్థాయిలో సిక్సర్లు బాదుతూ బౌలర్లకు చుక్కలు చూపించాడు. ధోనీ బాదుడు చూసి పక్కనే ఉన్న రైనా ఈల వేసి తన ఆనందాన్ని వ్యక్తం చేయడం విశేషం. 
 
కాగా, నెట్స్‌లో ధోనీ బౌలింగ్ కూడా చేశాడు. ఈసారి ఐపీఎల్ పోటీలు యూఏఈలో జరగనున్న సంగతి తెలిసిందే. సెప్టెంబరు 19న మొదలయ్యే ఐపీఎల్ 13వ సీజన్ నవంబరు 10తో ముగుస్తుంది. కరోనా వైరస్ మహ్మారి కారణంగా ఈ పోటీల వేదికను యూఏఈకి మార్చిన విషయం తెల్సిందే. 
 
కాగా, ఇటీవలే అంతర్జాతీయ క్రికెట్ కెరీర్‌కు స్వస్తి పలికిన ధోనీ... ఎంతో కసితో రగిలిపోతున్నట్టు కనిపిస్తున్నాడు. ఈ విషయం ఆయన చెన్నై సూపర్ కింగ్స్ తరపున చేస్తున్న నెట్ ప్రాక్టీస్ చూస్తే ఇట్టే అర్థమవుతోంది. 
 
గతేడాది ఇంగ్లండ్‌లో జరిగిన ప్రపంచకప్ తర్వాత ధోనీ టీమిండియాకు ఆడలేదు. మళ్లీ ఇన్నాళ్లకు ఐపీఎల్ ద్వారా తన బ్యాటింగ్, కీపింగ్ విన్యాసాలను అభిమానులకు ప్రదర్శించే వీలు చిక్కింది.

 

The super camp sorely missed the super fans, thanks to COVID. But we managed to end it with a loud whistle! #WhistlePodu #Yellove

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు