స్వదేశంలో జరుగుతూ వచ్చిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ 14వ సీజన్ పోటీలు కరోనా వైరస్ కారణంగా అర్థాంతరంగా వాయిదాపడ్డాయి. సగం మ్యాచ్‌లు పూర్తికాగా, మిగిలిపోయిన మ్యాచ్‌లను సెప్టెంబర్‌లో నిర్వహించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ మ్యాచులు సెప్టెంబర్ 15 నుంచి అక్టోబర్ 15 వరకు మిగిలిన 31 మ్యాచులు ఆడించనున్నట్లు తెలుస్తున్నది.
ఐపీఎల్‌లో మిగిలిన మ్యాచ్‌లకు బీసీసీఐ చివరకు ఒక పరిష్కారం కనుగొన్నది. మిగిలిన మ్యాచ్‌లు సెప్టెంబర్ 15 నుంచి అక్టోబర్ 15 మధ్య యూఏఈలో జరుగుతాయని బీసీసీఐ వర్గాలు తెలిపాయి. అయితే, ఇదేసమయంలో ఈ మ్యాచ్‌ల నిర్వహణ కోసం ఇంగ్లండ్, యూఏఈలను బోర్డు పరిశీలిస్తున్నట్లు తెలుస్తున్నది.