అంపైర్‌కు సిగ్నల్ ఇచ్చినందుకు కెరీర్‌లో తొలిసారిగా తీవ్ర మందలింపుకు గురైన టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ ఎంత గొప్ప ఆటగాడో, ఎంత గొప్ప వ్యూహ నిపుణుడో పదేళ్లుగా క్రికెట్ ప్రపంచం చూస్తూనే ఉంది. అతడి సలహాలు ఎంత అమూల్యమైనవో విరాట్ కోహ్లీని అడిగితే తెలుస్తుంది. ఇప్పుడు రైజింగ్ పుణె సూపర్ జెయింట్ జట్టు కెప్టెన్ స్టీవ్ స్మిత్ ఆ విషయాన్ని తొలి మ్యాచ్‌లోనే గ్రహించేశాడు. ముంబై ఇండియన్ జట్టుతో తమ తొలి మ్యాచ్‌లో స్మిత్ అద్బుత బ్యాటింగ్‌తో తొలిబోణీ కొట్టిన విషయం తెలిసిందే కానీ అంత గొప్ప బ్యాట్స్‌మన్ కూడా ఎలాంటి అహం అన్నది లేకుండా పలుసార్లు మైదానంలో ధోనీతో మాట్లాడటం, సలహా తీసుకోవడం చాలామందిని కదిలించింది.
ముంబై ఇండియన్స్ జట్టు బ్యాటింగ్ చేస్తున్నప్పుడు మైదానంలో ఉన్న స్మిత్ చాలా సార్లు ధోనీ దగ్గరికి వెళ్లి రావడం ప్రేక్షకులు గమనించారు. కానీ అలా దోనీని ఎందుకు కలుస్తున్నాడో ముందుగా అర్థం కాలేదు. మ్యాచ్ ముగిసిన తర్వాత పుణె ఆటగాడు అజింక్యా రహానే అసలు విషయం చెప్పేశాడు. ఐపీఎల్‌లో స్మిత్‌కి ఇది కెప్టెన్‌గా తొలి మ్యాచ్ కావడంతో ధోనీ నుంచి చాలా నేర్చుకున్నాడని, మ్యాచ్ మధ్యలో ధోనీతో చర్చించి సలహాలు తీసుకుని ఫీల్డింగ్‌లో మార్పులు చేశాడు అని రహానే తెలిపాడు.
ఈ ఇద్దరి కెప్టెన్లలో ఎవరు ఉత్తమం అని రహానేను అడగగా... స్మిత్ నాయకత్వంలో ఒక్క మ్యాచే ఆడానని, ధోనీ సారథ్యంలో ఎన్నో మ్యాచ్‌లు ఆడినట్లు చెప్పాడు. ధోనీ ప్రపంచంలోనే గొప్ప నాయకుడు, ఆటగాడని రహానె కితాబిచ్చాడు. స్మిత్ సారథ్య బాధ్యతలను గొప్పగా నిర్వహించాడని అన్నాడు. అయితే ధోనీనే తన బెస్ట్ లీడర్ అని రహానె చెప్పాడు. ఐపీఎల్ ప్రారంభం నుంచి ఇప్పటి వరకూ సారథ్య బాధ్యతలు లేకుండా ధోనీ బరిలోకి దిగింది కూడా ఈ మ్యాచ్‌లోనే కావడం విశేషం.