ఐపీఎల్ 2022 మెగా వేలం జరుగుతోంది. శనివారం జరుగుతున్న ఈ వేలం పాటలో మిస్టర్ ఐపీఎల్‌గా పేరొందిన సురేష్ రైనాకి ఊహించని షాక్ తగిలింది. ఐపీఎల్‌లో 5 వేలకు పరుగులు చేసిన సురేష్ రైనాని తొలి రౌండ్‌లో కొనుగోలు చేయడానికి ఏ ఫ్రాంఛైజీ కూడా ఆసక్తి చూపించలేదు. చెన్నై సూపర్ కింగ్స్ విజయాల్లో కీలక పాత్ర పోషించిన సురేష్ రైనాని కొనుగోలు చేయడానికి సీఎస్‌కే కూడా బిడ్ వేయకపోవడం అందరికీ షాక్ ఇచ్చింది.
ఇందుకు కారణం గత ఐపీఎల్ నుంచి ఆయన ఉన్నట్టుండి తప్పుకోవడమే. ఇకపోతే.. సౌతాఫ్రికా హిట్టర్ డేవిడ్ మిల్లర్, ఐపీఎల్ 2022 సీజన్‌లో అమ్ముడుపోని మొట్టమొదటి ప్లేయర్‌గా రికార్డు క్రియేట్ చేశాడు. బంగ్లా ఆల్‌రౌండర్ షకీబ్ అల్ హసన్ కూడా ఐపీఎల్ 2022 వేలంలో అమ్ముడుపోలేదు. సీఎస్‌కే మాజీ ఆల్‌రౌండర్ డీజే బ్రావోని ఐపీఎల్ 2022 మెగా వేలంలో రూ.4.4 కోట్లకు తిరిగి కొనుగోలు చేసింది చెన్నై సూపర్ కింగ్స్.
ఇంగ్లాండ్ ప్లేయర్, రెండు రోజుల క్రితం పీఎస్‌ఎల్‌లో సెంచరీ చేసిన జాసన్ రాయ్‌ని రూ.2 కోట్లకు గుజరాత్ లయన్స్ జట్టు కొనుగోలు చేసింది. రాబిన్ ఊతప్పను రూ.2 కోట్లకు దక్కించుకుంది చెన్నై సూపర్ కింగ్స్. ఐపీఎల్ 2021 సీజన్ నాకౌట్ మ్యాచుల్లో అదరగొట్టిన ఊతప్పను సింగిల్ బిడ్‌కే దక్కించుకుంది.