మయాంక్ పక్కటెముకలకు బలంగా తాకిన బాల్.. అయ్యబాబోయ్! (video)

సోమవారం, 23 మే 2022 (15:28 IST)
ఐపీఎల్ 2022 లీగ్ చివరి మ్యాచ్‌ ముంబైలోని వాంఖడే స్టేడియంలో సన్‌రైజర్స్ హైదరాబాద్, పంజాబ్ కింగ్స్ మధ్య జరిగింది.  ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన హైదరాబాద్ 157 పరుగులు చేసింది.
 
లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఉమ్రాన్ మాలిక్ వేసిన బంతి పంజాబ్ కెప్టెన్ మయాంక్ అగర్వాల్ పక్కటెముకలకు బలంగా తాకింది. 
 
ఈ బంతి దాదాపు 143 కేపీహెచ్ వేగంతో వచ్చింది. బంతి తగిలిన తర్వాత మైదానంలో మయాంక్ నొప్పితో బాధపడడ్డాడు. అతనికి మైదానంలోనే ఫిజియోథెరపి చేశారు. 
 
షారుఖ్ ఖాన్ ఔటైన తర్వాత పంజాబ్ కెప్టెన్ మయాంక్ అగర్వాల్ 7వ ఓవర్లో బ్యాటింగ్‌కు దిగాడు. ఉమ్రాన్ మాలిక్ షార్ట్ బాల్‌తో అతనికి స్వాగతం పలికాడు. మయాంక్ అగర్వాల్ బంతి వేగాన్ని అర్థం చేసుకోకపోవడంతో పక్కటెముకలకు తగిలింది. దీంతో పెనుముప్పు తప్పింది. 
 
బ్యాటింగ్‌ కొనసాగించిన అగర్వాల్‌ ఆ తర్వాతి ఓవర్‌లోనే మయాంక్ భారీ షాట్ కొట్టే ప్రయత్నంలో వాషింగ్టన్ సుందర్ చేతిలో 1 పరుగు వద్ద ఔటయ్యాడు. 

#PBKSvsSRH pic.twitter.com/EvPAWBzuOc

— Jemi_forlife (@jemi_forlife) May 22, 2022

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు