ఏది నిజం! ... అక్కడ కన్యగా ఉండనివ్వరట!!

"కామిగాని వాడు మోక్షగామి" కాలేడు అన్నారు శృంగార అనుభవజ్ఞులు. ఆ నానుడికి తగిన విధంగానే ప్రాచీన కాలం నుంచి నేటి వరకు మానవుడు శృంగారానికి విశేష ప్రాధాన్యతనిచ్చాడు. ఇస్తూనే ఉన్నాడు. అంతేకాకుండా అనేక దేశాల నాగరికతల్లో శృంగారాన్ని ఓ దైవత్వంగా భావించేవాళ్ళు. ఈజిప్టు, గ్రీకు, రోమ్‌, అరబ్‌ వంటి దేశాల్లో శృంగారానికి సంబంధించి అనేక ఆచారాలు వాడుకలో ఉండేవి. కొన్ని.. ఆచరణయోగ్యంగా ఉంటే.. మరికొన్ని ఆచారాలు వింతవింతగా ఉండేవి.

ఇలాంటి వింత ఆచారాల్లో కొన్నింటిని తెలుసుకుందాం. ప్రాచీన ఈజిప్టులో ఒక స్త్రీ.. కన్యగా ఉండేందుకు అంగీకరించే వారు కదా. ఒకవేళ కన్యగా ఆ స్త్రీ మరణించినా.. ఆమె కన్యత్వాన్ని ఆలయ పూజారో లేక రసవాదో చెరిపాలనే ఆచారం ఉంది. ఆ తర్వాతే ఆ కన్య శవాన్ని శ్మశానంలో పాతిపెట్టేవారట.

అలాగే, ఒక ప్రాచీన అరబిక్‌ గ్రంథంలో పేర్కొన్న అంశాల మేరకు.. పురుషుడి అంగం పెద్దదిగా చేయడానికి గాడిద శిశ్నాన్ని మొక్కజొన్నలతో, ఉల్లిపాయలతో కలిపి ఉడకబెట్టేవాళ్ళట. ఆ తర్వాత వాటిని కోళ్ళకు మేతగా వేసి అవి ఆరగించిన తర్వాత ఆ కోళ్ళను తినేవారట.

ఇకపోతే.. తూర్పు బొలీవియాలో స్త్రీ గర్భవతి అయ్యాక ఆమె భర్త తరుచుగా, వీలైనన్ని ఎక్కువ సార్లు సంభోగం జరిపుతాడట. ఇలా సంభోగం చేయడం వల్ల భర్త వీర్యం అదనంగా లోపలికి వెళ్లి బిడ్డ బలంగా, పొడవుగా పెరగడానికి ఉపయోగపడుతుందని నమ్మేవారట.

వెబ్దునియా పై చదవండి