ఎయిర్‌టెల్ సరికొత్త ఆఫర్.. రూ.65కే ఫ్రీకాల్స్ - ఇంటర్నెట్ కూడా...

గురువారం, 29 మార్చి 2018 (12:39 IST)
దేశీయ టెలికాం రంగంలోకి ధరల యుద్ధం ఇంకా కొనసాగుతోంది. టెలికాం రంగంలోకి రిలయన్స్ జియో సేవలు ప్రారంభమైన తర్వాత ఈ ధరల యుద్ధం ప్రారంభమైన విషయం తెల్సిందే. జియో సేవలు ప్రారంభంకాకముందు ఆకాశంలో ఉన్న టెలికాం సేవల ధరలు ఒక్కసారిగా కిందికిదిగివచ్చాయి. 
 
ఈనేపథ్యంలో ప్రైవేట్ టెలికాం దిగ్గజం ఎయిర్‌టెల్ తన ప్రీపెయిడ్ వినియోగదారుల కోసం సరికొత్త ఆఫర్‌ను ప్రవేశపెట్టింది. తక్కువ ఇంటర్నెట్ వినియోగించే వారి కోసం ఈ కొత్త పథకాన్ని ప్రకటించింది. కేవలం రూ.65కే 1జీబీ డేటాను ఆఫర్ చేస్తోంది. వ్యాలిడిటీ 28 రోజులు. అయితే, ఇది 4జీ డేటా కాదు. 2జీ/3జీ డేటాకే పరిమితం. ఇది కేవలం ఎంపిక చేసిన ప్రీపెయిడ్ ఖాతాదారులకు మాత్రమే. 
 
అయితే, 4జీ డేటానే కావాలనుకునే వారి కోసం మరో ప్లాన్‌ను ప్రవేశపెట్టింది. రూ.98 రీచార్జ్ చేసుకుంటే 2జీబీ 4జీ/3జీ డేటాను 28 రోజుల పాటు పొందొచ్చు. ఎంపిక చేసిన కొందరు ఖాతాదారులు రూ.98 రీచార్జ్ పై 28 రోజుల వ్యాలిడిటీతో 5జీబీ కూడా ఆఫర్ చేస్తోంది.
 
ఇకపోతే, పోటీ సంస్థ జియోలోనూ డేటాతో కూడిన తక్కువ విలువ కలిగిన రెండు పథకాలున్నాయి. రూ.49కే నెలంతా అన్ లిమిటెడ్ కాలింగ్, 1జీబీ డేటా ప్లాన్ కేవలం జియో ఫోన్లు వాడే వారికి పరిమితం. రూ.98 ప్లాన్ పై 2జీబీ 4జీ డేటాను 28 రోజుల కాలపరిమితితో అందిస్తోంది. అలాగే, అపరిమిత కాలింగ్, 300 ఉచిత ఎస్ఎంఎస్‌లు కూడా పొందొచ్చు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు