జియోకు ధీటుగా ఎయిర్‌టెల్ వెయ్యి జీబీల అదనపు డేటా..

సోమవారం, 7 ఆగస్టు 2017 (13:00 IST)
జియోకు ధీటుగా ఎయిర్‌టెల్ 1000 జీబీల అదనపు డేటా ఆఫర్‌‍ను ప్రకటించింది. భారత టెలికాం సంస్థలు జియో రాకను పురస్కరించుకుని.. ఎయిర్‌టెల్, వొడాఫోన్, ఐడియా, ఎయిర్‌సెల్ వంటి సంస్థలు ఆఫర్లు ప్రకటిస్తున్న సంగతి తెలిసిందే. దీనిప్రకారం ఎయిర్‌టెల్ కొత్త ఆఫర్లను ప్రకటించింది.

రూ.599, రూ.699, రూ.849, రూ.999, రూ.1199, రూ.1599 ఆఫర్లలో 1000 జీబీ అదనపు డేటాను ఇచ్చింది. దీనికి  సంబంధించిన వ్యాలిడిటీ మార్చి 31 2018తో పూర్తవుతుంది. ఈ ఆఫర్ బ్రాడ్ బాండ్ కస్టమర్ల వరకేనని.. కొత్త బ్రాడ్ బ్యాండ్ సేవలు పొందేవారు ఈ ఆఫర్లను పొందవచ్చునని ఎయిర్‌టెల్ ప్రకటించింది. 
 
ఇదే విధంగా జియో ధనా ధన్ పేరుతో రూ.399 ఆఫర్‌ను ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇదే తరహాలో ఎయిర్‌టెల్ కూడా ఆఫర్‌ను ప్రకటించింది. ప్రీ పెయిడ్ కస్టమర్లకు మాత్రమే దీన్ని వర్తింపజేస్తోంది. 4జీ ఫోన్లు, 4జీ నెట్‌వర్క్ ఉన్నవారే ఈ ప్యాకేజీకి అర్హత కలిగినవారవుతారు.

ఎయిర్‌టెల్ రూ.399 ప్యాకేజీ వ్యాలిడిటీ 84 రోజులు. నెట్ వర్క్ ఏదైనా అన్ లిమిటెడ్ కాల్స్ చేసుకోవచ్చు. లోకల్, ఎస్టీడీకి లిమిట్ లేదు. రోజుకు 1జీబీ చొప్పున 84 రోజులు డేటా వస్తోంది. జియో ఫోన్ మార్కెట్లోకి వస్తోన్న క్రమంలో వినియోగదారులను కాపాడుకునేందుకు ఎయిర్‌టెల్ ఈ ఆఫర్ ప్రకటించింది.

వెబ్దునియా పై చదవండి