అమేజాన్ నుంచి యువతకు శుభవార్త... పార్ట్ టైమ్ జాబ్స్ రెడీ..

బుధవారం, 19 జూన్ 2019 (12:24 IST)
అమేజాన్ నుంచి శుభవార్త. ఉద్యోగాల కోసం వేయి కనులతో ఎదురుచూస్తున్న యువతకు అమేజాన్ సంస్థ పార్ టైమ్ ఉద్యోగాలను ఇవ్వనుంది. ఖాళీగా ఉన్న సమయంలో అమెజాన్‌ ప్యాకేజీలను డెలివరీ చేసి గంటకు రూ. 140 వరకు సంపాదించుకోవచ్చునని ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ అమేజాన్ స్పష్టం చేసింది. 
 
''అమేజాన్‌ ఫ్లెక్స్'' పేరుతో ఈ పార్ట్‌టైం ప్రోగ్రామ్‌ను కంపెనీ తాజాగా భారత్‌లో ప్రారంభించింది. అమేజాన్‌ ఫ్లెక్స్‌ను తొలిసారిగా 2015లో అమెరికాలో ప్రారంభించారు. ఇప్పుడు భారత్‌కు తీసుకొచ్చారు. ఈ అమేజాన్ ఫ్లెక్స్ యాప్‌లో రిజిస్టర్ అయ్యే ప్యాకేజీలను డెలివరీ చేయొచ్చునని కంపెనీ వెల్లడించింది.

కానీ రిజిస్టర్ అయ్యేవారికి కనీసం సొంత ద్విచక్రవాహనం ఉండాలని, ఆండ్రాయిడ్ ఫోన్ కూడా వుండాలి. ఎందుకంటే అమెజాన్‌ ఫ్లెక్స్‌ యాప్ ప్రస్తుతం ఆండ్రాయిడ్ ఫోన్లలో మాత్రమే పనిచేస్తోంది కాబట్టి.
 
ఇకపోతే.. ప్యాకేజీలు డెలివరీ చేసే ముందు కంపెనీ పార్ట్‌టైమ్ ఉద్యోగులకు కొంత శిక్షణ కూడా ఇస్తుంది. ప్రస్తుతం ఈ ప్రోగ్రామ్‌ను బెంగళూరు, ముంబయి, దిల్లీలో ప్రారంభించారు. త్వరలోనే భారత్‌లోని ఇతర నగరాలకు కూడా విస్తరించనున్నట్లు కంపెనీ వెల్లడించింది. తమకు దొరికిన సమయాన్ని వృధా చేయకుండా యువత ఇలాంటి పార్ట్ టైమ్ జాబ్స్ చేసేందుకు సిద్ధంగా వున్నట్లు అమేజాన్ సంస్థ తెలిపింది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు