టిక్‌టాక్ వ్యవహారంలో అమేజాన్ కాస్త వెనక్కి తగ్గింది. టిక్‌టాక్ యాప్‌ను తమ ఫోన్ల నుంచి తీసేయాలని కోరుతూ ఉద్యోగులకు మెయిల్ పంపిన అమేజాన్ సంస్థ కొన్ని గంటల్లోనే వెనక్కి తగ్గుతూ ప్రకటన చేసింది. పొరపాటుగా ఈ-మెయిల్ పంపామని, టిక్‌టాక్ నిషేధంపై ప్రస్తుతం తమకు ఎలాంటి విధానాలు లేవని పేర్కొంది.
టిక్‌టాక్ పునరుద్ధరణకు సంబంధించి ఏం జరిగిందనే ప్రశ్నలకు సమాధానం ఇవ్వడానికి అమెజాన్ డాట్‌కామ్ ప్రతినిధి జాకీ అండర్సన్ నిరాకరించారు. టిక్‌టాక్ యాప్‌ను తీసేయాలని ఉద్యోగులకు మొయిల్ పంపగా ఆ విషయం కాస్తా టిక్‌టాక్ ప్రతినిధి వరకు చేరింది. దీంతో వెంటనే రంగంలోకి దిగిన ఆయన అమెజాన్ ప్రతినిధి జాకీ అండర్సన్‌తో పరస్పరం చర్చలు జరిపారు.