ఉచితమే కదా.. అని.. మొబైల్ యాప్స్ డోన్‌లోడ్ చేసుకుంటున్నారా? కాస్త జాగ్రత్త..!

బుధవారం, 5 ఏప్రియల్ 2017 (14:12 IST)
మొబైల్ యాప్ డోన్‌లోడ్ చేసుకుంటున్నారా? అయితే కాస్త ఆగండి. షాపింగ్‌కు.. ప్రయాణానికి.. సినిమా టికెట్లకు.. ఇలా ప్రతి దానికీ ఓ యాప్ డౌన్ లోడ్ చేసుకునే వారు మీరైతే.. మీరు దాచుకునే రహస్యాలన్నీ బయటపడతాయని ఐటీ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఉచితమే కదా అని యాప్‌లను డౌన్‌లోడ్ చేసుకుంటే.. మీ వ్యక్తిగత సమాచారం.. మొత్తాన్ని లాగేయడం ఖాయమని నిపుణులు వార్నింగ్ ఇస్తున్నారు.  
 
ఒకటే కాదు.. ఇలాంటివి.. వేల సంఖ్యల్లో ఉన్నాయని.. వ్యక్తిగత సమాచారాన్ని చోరీ చేయడంలో ఈ యాప్‌లు ఒకదానితో ఒకటి సహాయం చేసుకుంటున్నాయనే విషయాన్ని వర్జీనియా టెక్నాలాజికల్ వర్శిటీ పరిశోధకులు తెలిపారు. అప్లికేషన్లను ఏ ఉద్దేశంతో తయారు చేసుకుంటున్నప్పటికీ.. కొన్ని సందర్భాల్లో యాప్ తయారీదారులకు కూడా తెలియకుండా ఈ పనులకు ఉపయోగపడుతున్నాయని పరిశోధకులు చెప్పారు. 
 
కొన్ని రకాల అప్లికేషన్లు కేవలం సైబర్ అటాక్‌ల కోసమే ప్రత్యేకంగా తయారు చేస్తున్నట్లు చెప్పారు. మూడేళ్ల పాటు జరిగిన ఈ ప్రోగ్రామ్‌లో 110150 యాప్‌లను పరిశోధకులు పరిశీలించారు. వీటిల్లో 10వేల వరకు వైరస్‌ను వ్యాపింపజేసే ప్రమాదకరమైన యాప్‌లున్నాయని.. మిగిలిన వాటిల్లో చాలావరకు మొబైల్‌లోని సమాచారాన్ని లీక్ చేస్తున్నట్లు తేలిందని పరిశోధకులు చెప్తున్నారు.

వెబ్దునియా పై చదవండి