శాంసంగ్ ఫోన్ తయారీకి రూ.19,500 ఖర్చైతే.. అమ్మకపు ధర మాత్రం రూ.57,900?

శనివారం, 22 ఏప్రియల్ 2017 (14:55 IST)
ప్రముఖ మొబైల్ తయారీ సంస్థ శాంసంగ్‌ గురించి కొత్త రిపోర్ట్ విడుదలైంది. శాంసంగ్ నుంచి విడుదలై గెలాక్సీ ఎస్8 గురించి ఆసక్తికరమైన సమాచారం ఓ నివేదిక ద్వారా వెలుగులోకి వచ్చింది. శాంసంగ్ స్మార్ట్ పోన్ గెలాక్సీ నోట్ 7ను తయారీ ఖర్చుతో పోలిస్తే రూ.26,700 అధికంగా అమ్ముతున్నారని తెలిసింది. ఈ ఫోన్ తయారీకి చాలా తక్కువగా ఖర్చైనట్లు నివేదికలోని వివరాల ద్వారా వెల్లడి అయ్యింది. 
 
ఈ క్రమంలో తాజా రిపోర్టు ప్రకారం ఎస్8 స్మార్ట్ ఫోన్ తయారీకి రూ. 19,500 కాగా, దీన్ని రూ. 57,900కు అమ్ముతున్నారని తేలింది. అంతేగాకుండా.. ఈ నివేదిక ప్రకారం, విడి భాగాలను అమర్చేందుకు అయిన ఖర్చు రూ.392 అని, గెలాక్సీ ఎస్7 కన్నా రూ. 2,800 ఎక్కువ ఖర్చు పెట్టారని, ఇదే సమయంలో ఎస్ 7 ఎడ్జ్‌తో పోలిస్తే రూ. 2,300 తక్కువని, బ్యాటరీ ధర కేవలం రూ. 291 మాత్రమేనని వెల్లడించింది. 
 
కానీ తయారీకి ఖర్చు తక్కువే అయినప్పటికీ.. అధికంగా అమ్ముతున్న మొత్తం ద్వారా పన్నులు, రీటైల్ మార్జిన్, పన్నులు వంటి వాటికి ఈ మొత్తాన్ని ఉపయోగిస్తారని.. ఇదంతా కంపెనీకి లాభంగా మిగులుతుందని చెప్పలేమని ఆ నివేదిక ద్వారా తేలింది.

వెబ్దునియా పై చదవండి