అనుకోకుండా మీ ఆండ్రాయిడ్ ఫోన్ కింద పడి పూర్తిగా పగిలిపోయిందా? స్క్రీన్‌పై పగుళ్ళు ఏర్పడిన టచ్ రెస్పాన్స్ ఏ మాత్రం స్పందించడం లేదా? మరి ఇలాంటి సందర్భాల్లో లాక్ కాబడి ఉన్న మీ ఫోన్‌ను ఎలా అన్ లాక్ చేస్తారు? ఫోన్‌లోని డేటాను యాక్సిస్ చేసుకోవాలంటే, తప్పనసరిగా ఫోన్‌ను అన్‌లాక్ చేయాల్సిందే.
దీనికి కొన్ని ప్రోసీజర్స్ అందుబాటులో ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో మీ ఆండ్రాయిడ్ ఫోన్‌ను అన్ లాగ్ చేసేందుకు కొన్ని ప్రోసీజర్స్ అందుబాటులో ఉన్నాయి. వీటిలో ఏదో ఒక ప్రొసీజర్‌ను మీరు అనుసరించడం ద్వారా ఫోన్‌ను అన్ లాక్ చేయవచ్చు. ఆండ్రాయిడ్ కంట్రోల్ పోగ్రామ్ ముందుగా ఆండ్రాయిడ్ కంట్రోల్ పోగ్రామ్ అనే సాఫ్ట్‌వేర్‌ను ఇంటర్నెట్ నుంచి మీ కంప్యూటర్‌లోకి డౌన్‌లోడ్ చేసుకుని ఇస్టాల్ చేసుకోవాలి. ఇప్పుడు మీ ధ్వంసమైన ఫోన్‌ను కంప్యూటర్‌కు యుఎస్‌బి డేటా కేబుల్ ద్వారా కనెక్ట్ చేయండి.
అలాగే ముందుగా మీ కంప్యూటర్ నుంచి ఆండ్రాయిడ్ డివైడ్ మేనేజర్ వెబ్‌సైట్‌లోకి వెళ్ళండి. ధ్వంసమైన మీ ఆండ్రాయిడ్ డివైస్‌లో గూగుల్ అకౌంట్ అలాగే జిపిఎస్ ఫీచర్లు ఎనేబుల్ చేసి ఉన్నట్లయితే ఆ అకౌంట్‌లోకి లాగినై స్కాన్ చేయండి. మీ డివైస్ కనెక్ట్ అయిన వెంటనే ఆండ్రాయిడ్ డివైస్ మేనేజర్ పేజీలో రింగ్, లాక్, ఎరేస్ ఆప్షన్‌లు కనిపిస్తాయి. వాటిలో లాక్ ఆప్షన్‌పై క్లిక్ చేయండి. అప్పటికే మీ ఫోన్‌లాక్ అయి ఉంటుంది కాబట్టి వ్యతిరేకంగా అన్‌లాక్ అవుతుంది.