మేడ్ ఇన్ ఇండియా నినాదం ప్రస్తుతం యాపిల్ ఫోన్లకు కూడా వర్తించనుంది. యాపిల్ ఐ ఫోన్లు ఇక దేశంలోనే ఉత్పత్తి కానున్నాయి. తమిళనాడు రాజధాని చెన్నైకి సమీపంలోని తన యూనిట్‌లో తైవానుకు చెందిన ఫాక్స్ కాన్ ప్రయోగాత్మకంగా ఐఫోన్13 మోడల్ తయారీని మొదలు పెట్టింది. దీంతో భారత్‌లో తయారీ దిశగా యాపిల్ అడుగులు వేసేలా చేయడంలో కేంద్రంలోని మోదీ సర్కారు కృషి ఫలించింది.