మీ పాన్‌కార్డులో ఏమైనా తప్పులుంటే ఇలా సరిచేసుకోవచ్చు..?

మంగళవారం, 11 మే 2021 (19:10 IST)
మీ పాన్‌కార్డులో ఏమైనా తప్పులుంటే ఈ విధంగా సరిచేసుకోవచ్చు. అయితే, దీనికోసం మీరు ఎక్కడికీ వెళ్లాల్సిన పనిలేదు. ఇంటి వద్ద నుంచే మీ పాన్‌ కార్డు తప్పులు ఇలా సరిచేసుకోవచ్చు. అకౌంట్‌ దగ్గరి నుంచి ఐటీఆర్‌ దాఖలు చేయడానికి కూడా ఉంది. పాన్‌ కార్డు అంత ముఖ్యం. ఆధార్‌ కార్డు మాదిరిగానే పాన్‌ కూడా కీలకమైన డాక్యుమెంట్‌. బ్యాంకింగ్‌ లవాదేవీలకు సైతం పాన్‌ కార్డు చాలా అవసరం ఉంటుంది. అందుకే పాన్‌ కార్డు కచ్చితంగా తీసుకోవాలి.
 
ఇప్పటికే పాన్‌ కార్డు కలిగి ఉన్న వారు అయితే పాన్‌ కార్డులో వివరాలు అన్నీ కరెక్ట్‌గా ఉన్నాయా? లేదా? అని చెక్‌ చేసుకోవాలి. ఒకవేళ పాన్‌ కార్డు వివరాలు తప్పుగా ఉంటే.. వాటిని సరిదిద్దుకోవాలి. లేకపోతే ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఇందుకోసం ఎన్‌ఎస్‌డీఎల్‌ లేదా యూటీఐ వెబ్‌సైట్‌కు వెళ్లాలి. 
 
https://tin.tin.nsdl.com/pan/correction.html ∙వెబ్‌సైట్‌ లింక్‌ ఓపెన్‌ చేయాల్సి ఉంటుంది. ఆ పేజీలో కిందకు వెళ్లి ఇండివీజువల్‌ అనే ఆప్షన్‌ ఎంచుకోవాలి. ఆ తర్వాత సబ్‌మిట్‌ చేయాలి. అప్పుడు ఒక కొత్త పేజ్‌ ఓపెన్‌ అవుతుంది.
 
ఆ తర్వాత మీరు మీ ఆధార్‌ నెంబర్‌ ఎంటర్‌ చేయాల్సి ఉంటుంది. ఫోటో లేదా సిగ్నేచర్‌ కరెక్ట్‌గా లేకపోతే ఫోట్‌ లేదా సిగ్నేచర్‌ మిస్‌ మ్యాచ్‌ అనే ఆప్షన్‌ ఎంచుకోవాలి. అప్పుడప్పుడు నెక్ట్స్ బటన్‌ పై క్లిక్‌ చేయాలి. తర్వాత వ్యక్తిగత వివరాలు ఎంటర్‌ చేయాల్సి ఉంటుంది. పాన్‌ కరెన్షన్‌ కోసం అవసరమైన డాక్యుమెంట్లను అప్‌లోడ్‌ చేయాలి.

ఫోటోగ్రాఫ్, సిగ్నేచ్‌లో మార్పుల కోసం రూ.101 ఫీజు చెల్లించాలి. ఇక అంతే, ప్రాసెస్‌ పూర్తయిన తర్వాత పాన్‌ కార్డు ఇంటికే డెలివరీ అవుతుంది. అదే మీరు ఈ-పాన్‌ కార్డు పొందాలని భావిస్తే రూ.66 చెల్లించాల్సి ఉంటుంది. మీకు మెయిల్‌ వస్తుంది. డౌన్‌ లోడ్‌ చేసుకుంటే సరిపోతుంది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు