ప్రస్తుతం మొబైల్ మార్కెట్‌ను స్మార్ట్‌ఫోన్లు ముంచెత్తున్నాయి. ఈ ఫోన్లలో అమర్చే ర్యామ్ సామర్థ్యం 2జీబీ, 3జీబీ, మహా అయితే 6జీబీ. అంతకంటే ఎక్కువ ర్యామ్ కలిగిన స్మార్ట్‌ఫోన్ ఇంతవరకూ మార్కెట్లో అందుబాటులోకి రాలేదు.
కానీ మొట్టమొదటిసారి తైవాన్ కంపెనీ అసస్ కంపెనీ 8జీబీ ర్యామ్ కలిగిన స్మార్ట్‌ఫోన్‌ను అందుబాటులోకి తెచ్చింది. జెన్‌ఫోన్ మోడల్స్ మార్కెట్లో విరివిగా ఆదరణ పొందడంతో ఈ కంపెనీ స్పీడ్ పెంచింది. వినియోగదారులకు మెరుగైన సేవలందించేందుకు 8జీబీ ర్యామ్‌తో మొట్టమొదటి సారి జెన్‌ఫోన్ ఏఆర్ అనే ఫోన్‌ను అందుబాటులోకి తెచ్చింది.