బీఎస్ఎన్ఎల్ ప్రత్యేక ఆఫర్లు....

బుధవారం, 22 మే 2019 (10:56 IST)
బీఎస్‌ఎన్‌ఎల్‌ మరోమారు ప్రత్యేక ఆఫర్లు ప్రకటించింది. త్వరలో రంజాన్‌ రానుండటంతో దాన్ని పురస్కరించుకుని బీఎస్‌ఎన్‌ఎల్‌ ప్రీపెయిడ్‌ వినియోగదారులకు రూ.899 ప్లాన్‌పై ప్రత్యేక రాయితీ అందించి రూ.786కే ఇస్తున్నట్లు బీఎస్‌ఎన్‌ఎల్‌ జనరల్ మేనేజర్ కేఎస్‌ వరప్రసాద్‌ తెలియజేశారు. 
 
ఈ ప్లాన్ క్రింద వినియోగదారులు రూ.113 తగ్గింపు పొందగలరని చెప్పారు. దాదాపు 180 రోజుల పాటు దేశ వ్యాప్తంగా అన్ని నెట్‌‌వర్క్‌లకు అపరిమితంగా ఉచిత కాలింగ్‌ చేసుకునే సౌలభ్యం ఉందన్నారు. ముంబై, ఢిల్లీలో తప్ప మిగిలిన అన్ని ప్రాంతాల్లో రోమింగ్‌ సదుపాయం ఉందని తెలియజేసారు. 
 
దీని క్రింద ప్రతిరోజూ 1.5 జీబీ ఉచిత హైస్పీడ్‌ డేటాతో పాటు రోజుకు 50 ఉచిత ఎస్‌ఎంఎస్‌లు పొందే సౌలభ్యం ఉందన్నారు. అయితే ఈ ఆఫర్‌ జూన్‌ 5వ తేదీ వరకు మాత్రమే అందుబాటులో ఉంటుందని పేర్కొన్నారు. 
 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు