ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (బీఎస్ఎన్ఎల్) తన వినియోగదారుల కోసం సరికొత్త రీచార్జ్ ప్లాన్‌ను ప్రవేశపెట్టింది. రూ.108తో రీచార్జ్ చేసుకున్నవారికి 60 రోజలు కాలపరిమితోపాటు ప్రతి రోజు 1జీబీ డేటాను అందివ్వనుంది. ఇతర ప్రైవేటు కంపెనీలతో పోల్చుకుంటే ఈ ప్లాన్ ఎంతో ఉపయోగరకరంగా ఉంటుందని బీఎస్ఎల్ఎల్ పేర్కొంది.
ప్రస్తుతం జియో, ఎయిర్‌టెల్ సంస్థలు తమ ప్లాన్‌లో 1జీబీ డేటాను కేవలం 28 రోజులకు లేదా 56 రోజుల కాలపరిమితితో ఇస్తున్నారు. బీఎస్ఎన్ఎల్ తన రూ.108 కొత్త ప్లాన్‌లో 1జీబీ డేటాతో పాటు అన్‌లిమిటెడ్ కాలింగ్ ఆఫర్‌ను కూడా ఇచ్చింది.
ఒకవేళ డెయిలీ డేటా పూర్తి అయితే, అప్పుడు ఇంటర్నెట్ డౌన్‌లోడింగ్, అప్‌లోడింగ్ స్పీడ్‌ను 80కేబీపీఎస్‌తో ఇవ్వనున్నారు. ఈ కొత్త ప్యాక్ ఢిల్లీ, ముంబై ఎంటీఎన్ఎల్ నెట్వర్క్స్‌లో అందుబాటులోకి వచ్చింది.