BSNL Rs 91 plan: రీఛార్జ్‌ చేసుకోకపోయినా 90 రోజుల వరకు యాక్టివ్‌

సెల్వి

శనివారం, 4 జనవరి 2025 (20:04 IST)
ప్రభుత్వ రంగ టెలికాం రంగ సంస్థ బీఎస్ఎన్ఎల్ 4జీ, 5జీ సేవలు విస్తరణ దిశగా కూడా అడుగులు వేస్తుంది. టవర్లు ఏర్పాటు కూడా ఊపందుకుంది. బడ్జెట్‌ ఫ్రెండ్లీ ఈ ప్రభుత్వ రంగ బీఎస్ఎన్ఎల్ రీఛార్జ్ ప్లాన్లు అందుబాటులో ఉండటంతో ఎక్కువ మంది మొబైల్ యూజర్స్ ఆకర్షితులవుతున్నారు. 
 
తాజాగా రూ.91లతో అతి తక్కువ ధరలో బిఎస్ఎన్ఎల్ రీఛార్జ్ చేసుకుని అవకాశం కల్పిస్తోంది. ఈ ప్లాన్‌తో 90 రోజుల వ్యాలిడిటీ అందుతుంది. నెలవారీ ప్లాన్ ఎక్స్పైర్ అయిపోయిన తర్వాత ఇన్కమింగ్ కాల్స్, మెసేజెస్ కూడా అందుకుంటారు. ఈ బిఎస్ఎన్ఎల్ రూ.91 రోజుల రీఛార్జ్ ప్లాన్ మార్కెట్లో ఏ దిగ్గజ కంపెనీ అందించడం లేదు.
 
చాలా మంది వినియోగదారులు సిమ్ డియాక్టివేషన్‌ను నివారించడానికి ఖరీదైన ప్లాన్‌లతో తమ నంబర్‌లను తరచుగా రీఛార్జ్ చేసుకుంటారు. బీఎస్ఎన్ఎల్ తాజా ఆఫర్ అటువంటి ఆందోళనలను తొలగిస్తుంది. వినియోగదారులు వారి SIM కార్డ్‌లను నిరంతరం రీఛార్జ్‌ల అవసరం లేకుండా 90 రోజుల వరకు యాక్టివ్‌గా ఉంచడానికి అనుమతిస్తుంది.
 
 భారీ డేటా లేదా కాలింగ్ సేవలు అవసరం లేకపోతే.. కేవలం ఇన్‌కమింగ్ సేవల కోసం తమ యాక్టివ్ నంబర్‌ను కొనసాగించాలనుకునే వినియోగదారులకు ఇది ప్రత్యేకంగా ప్రయోజనకరంగా ఉంటుంది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు