ఇందుకు భారత్ ధీటుగా సమాధామిచ్చిందనట్టు తెలుస్తోంది. ముఖ్యంగా, భద్రతాంశాల దృష్ట్యా ఈ చర్య తీసుకున్నామని, తమ పౌరుల డాటాకు సంబంధించిన అంశాల్లో రాజీపడే ప్రసక్తి లేదని తేల్చిచెప్పిందని ఆ వర్గాలు పేర్కొన్నాయి.
దేశంలోని యూజర్ డాటాను సేకరించి, దానిని బయటకు పంపించే అవకాశాలున్నాయని ఇంటెలిజెన్స్ ఏజెన్సీల సమాచారంతో కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. అలాగే, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టం సెక్షన్ 69ఏ కింద ఈ చర్య తీసుకున్నట్టు కూడా కేంద్రం ప్రకటించింది.