కోవిడ్-19.. నో క్యాష్‌ డెలివరీ... అత్యవసర వస్తువులే డెలివరీ

శుక్రవారం, 27 మార్చి 2020 (18:13 IST)
కరోనా వైరస్ నియంత్రణకు దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ విధించిన నేపథ్యంలో.. ఈ-కామర్స్‌ దిగ్గజం అమేజాన్‌ కీలక నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా అమేజాన్‌ కొత్త ఆర్డర్లను స్వీకరించడం లేదు. గతంలో లెక్క క్యాష్‌ డెలివరీ కొనసాగిస్తే కోవిడ్‌-19 వైరస్‌ వ్యాప్తికి దోహదపడినట్లవుతుందని భావించిన అమేజాన్‌ నో క్యాష్‌ డెలివరీకి నిర్ణయం తీసుకుంది.
 
కేవలం అత్యవసర ఉత్పత్తులకు సంబంధించిన వస్తువుల ఆర్డర్లు తీసుకోవడంతో పాటు వాటి డెలివరీని కూడా నిర్ణీత సమయంలో అందిస్తామని స్పష్టం చేస్తుంది. అలాగే గతంలో ఆర్డర్స్ ఇచ్చిన వస్తువులు గౌడౌన్ల నుంచి బయటికి వెళ్లినా వాటి డెలివరీని తాత్కాలికంగా ఆపేస్తున్నట్లు ప్రకటించింది. కానీ అత్యవసర ఉత్పత్తులకు సంబంధించిన వస్తువులను కూడా ముందుగా ఆన్‌లైన్‌లో చెల్లింపులు (ప్రీ ఆన్‌లైన్‌ ప్రేమెంట్‌) జరిపిన వారికే అందిస్తామని ప్రకటించింది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు