డొనాల్డ్ ట్రంప్ జోక్యంతో మైక్రోసాఫ్ట్‌కు ఆ డీల్.. అమేజాన్ ఫైర్

ఆదివారం, 16 ఫిబ్రవరి 2020 (14:18 IST)
అమెరికా సైన్యానికి గాను సాంకేతిక ఒప్పందంపై తాత్కాలిక నిషేధం కారణంగా మైక్రోసాఫ్ట్ సంస్థకు చెందిన షేర్లు దారుణంగా పడిపోయాయి. ప్రపంచంలో అత్యధిక శాతం మైక్రోసాఫ్ట్ ఉత్పత్తులను ఉపయోగిస్తున్నారు.
 
ఈ నేపథ్యంలో శనివారం ఐదు నిమిషాల్లో ఈ కంపెనీకి దాదాపు ఒక లక్షా 20వేల కోట్ల రూపాయల నష్టం ఏర్పడింది. అమెరికా సైనిక వివరాలను భద్రపరిచేందుకు రూ.71వేల 120 కోట్ల ఒప్పందం కుదుర్చుకునేందుకు అమేజాన్, మైక్రోసాఫ్ట్ సంస్థ మధ్య పోటీ నెలకొంది. ఈ అవకాశాన్ని మైక్రోసాఫ్ట్ సొంతం చేసుకుంది.
 
ఇలాంటి పరిస్థితుల్లో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ జోక్యంతో మైక్రోసాఫ్ట్ ఈ అవకాశం పొందినట్లు అమేజాన్ ఆరోపించింది. ఈ ఒప్పందాన్ని రద్దు చేయాల్సిందిగా కోర్టును ఆశ్రయించింది. దీంతో మైక్రోసాఫ్ట్ సంస్థ షేర్లు భారీగా పడిపోయాయి. ఐదు నిమిషాల్లో ఒక లక్షా 20కోట్ల రూపాయల నష్టాన్ని చవిచూసింది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు